Tomato Benefits: కాళీ కడుపుతో టమోటాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
మన వంటింట్లో దొరికే ఊరగాయలలో టమోటా కూడా ఒకటి. కేవలం భారత్ లోనే కాకుండా ఇతర దేశాలలో కూడా
- Author : Anshu
Date : 29-12-2022 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
మన వంటింట్లో దొరికే ఊరగాయలలో టమోటా కూడా ఒకటి. కేవలం భారత్ లోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక భారత్లో వాళ్లు అయితే టమోటా పండ్లు లేకుండా చాలా రకాల వంటలను చేయడానికి ఇష్టపడరు. పప్పు, రసం, చట్నీ, సాంబార్, ఇలా చాలా వంటకాలలో టమోటాను ఉపయోగిస్తూ ఉంటారు. టమోటా పండు వంటలతో పాటు చాలామంది నేరుగా కూడా తింటూ ఉంటారు. అయితే చాలామంది టమోటా పండును ఉదయం పూట పరగడుపున తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు.
మరి టమోటో పంటను పరగడుపున తినడం వల్ల ఎటువంటి ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. టమోటా ను తినడం వల్ల అందులో ఉండే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెర, పీచు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఐరన్, ఫాస్పరస్, విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ సి వంటివి శరీరానికి పుష్కలంగా లభిస్తాయి. అలాగే విటమిన్ బి6, రైబోఫ్లావిన్ అందుతాయి. సాధారణంగా కడుపులో బ్యాక్టీరియా ఏర్పడడం అన్నది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉదయం సమయంలో టమోటా ను పసుపుతో పాటు తినడం వల్ల కడుపులో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది.
విటమిన్ బి6, రైబోఫ్లావిన్ అందుతాయి. చాలామంది గుండెల్లో మంటగా ఉంది అని అంటూ ఉంటారు. అటువంటివారు టమోటాని తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. చర్మంపై దద్దుర్ల సమస్యతో బాధపడే వారు ఉదయం ఖాళీ కడుపుతో టమోటాలు తినడం మంచిది. గుండె జబ్బుల సమస్యతో బాధపడేవారు టమోటాని తినడం వల్ల గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. దృష్టి లోపంతో బాధపడేవారికి, టొమాటోలను తినడం వల్ల విటమిన్-ఎ పుష్కలంగా ఉంటుంది. అందుకే రోజూ ఖాళీ కడుపుతో టమోటాలు తినడం మంచిది.