Walking: వామ్మో.. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఏకంగా అన్ని లాభాలు కలుగుతాయా?
చెప్పులు లేకుండా నడవడం మంచిదని ఇది ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుందని చెబుతున్నారు. మరి చెప్పులు లేకుండా నడవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పకలుగుతాయో ఎప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 04:00 PM, Fri - 16 May 25

ప్రస్తుత రోజుల్లో కాళ్లకు చెప్పులు లేకుండా నడిచే వాళ్ళు చాలా అరుదు. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరూ చెప్పులు, బూట్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఈ రోజుల్లో చెప్పులు లేకుండా బయటకు రారు. పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని నడుస్తూ ఉంటారు. కానీ చెప్పులు బూట్లు వంటివి లేకుండా వట్టి పాదాలతో నడిస్తే కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు నమ్మలేరు. కాళ్ల నొప్పి తగ్గించడం దగ్గర నుంచి… కాళ్ల వాపు తగ్గడం, నిద్ర మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందట. అలాగే మానసిక ఒత్తిడి తగ్గుతుందట. మొత్తం ఆరోగ్యం మెరుగుపడటంలోనూ సహాయపడుతుందని చెబుతున్నారు.
అలాగే కాళ్ల కండరాలు బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుందట. మీరు చెప్పులు లేకుండా వట్టి పాదాలతో నడవడం మొదలు పెట్టినప్పుడు పాదాల కండరాలు, మోకాలు, తుంటిపై ఒత్తిడి తగ్గిస్తుందట. ఇలా నడవడం మొదలు పెట్టినప్పుడు మొదట్లో కష్టంగా అనిపించినా కూడా అలవాటు అయితే మాత్రం చాలా ప్రయోజనాలు కలుగుతాయట. చెప్పులు లేకుండా వట్టి పాదాలతో నడవడం వల్ల సర్కాడియన్ రిథమ్ మెరుగుపడుతుందట. ఇది మన అంతర్గత 24 గంటల జీవ గడియారాన్ని మెరుగుపరుస్తుందని, ఇది రోజంతా మన శరీరం, మనస్సు, ప్రవర్తనలో మార్పులను తీసుకువస్తుందని నిద్ర, హార్మోన్లు, శరీర ఉష్ణోగ్రత, భావోద్వేగాలు వంటి ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా చూసుకుంటుందని చెబుతున్నారు.
నగ్న పాదాలతో నడవడం ద్వారా, పెద్ద చెప్పులు ధరించడం వల్ల కలిగే గోళ్ళ సమస్యలు వంటి పాదాల లోపాల నుండి ఉపశమనం లభిస్తుందట. అలాగే చెప్పులు లేకుండా నడవడం, పాదాల వంపును మెరుగుపరచడం, పాదాలు, కాళ్ళ కండరాలు, స్నాయువులను బలోపేతం చేయడం ద్వారా పాదాల యొక్కానిక్స్ ను మెరుగుపరచడంలో సహాయపడుతుందట. ఇది చీలమండ, పాదాల సహజ కదలికను కాపాడుకోవడానికి సహాయపడుతుందని చీలమండ, మోకాలు,తుంటిపై ఒత్తిడిని తగ్గిస్తుందని చెబుతున్నారు. గడ్డి, ఇసుక, మట్టి , నేల వంటి కఠినమైన ఉపరితలం వంటి వివిధ ఉపరితలాలపై నగ్న పాదాలతో నడవడం మన ఇంద్రియ అభివృద్ధిని మరింత మెరుగుపరుస్తుందట. నగ్న పాదాలతో నడవడం అటానమిక్ నాడీ వ్యవస్థను సమతుల్యం చేసే పారాసింపథెటిక్ చర్యను పెంచడం ద్వారా అధిక రక్తపోటును మెరుగుపరచడంలో సహాయపడుతుందట. అయితే మొదట చెప్పులు లేకుండా ఇంటి లోపల నడవడం ప్రారంభించాలి. ఇంటి లోపల నగ్న పాదాలతో నడవడం వల్ల మీ పాదాలపై ఉన్న కాళ్ల మందాన్ని మెరుగుపరుస్తుందట. ఇది మీ పాదాలను బయట నడవడానికి సిద్ధం చేస్తుందని, పొడి ఉపరితలాల కంటే తడి ఉపరితలాలను ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు..