Tulsi Leaves Benefits: తులసి ఆకులు, తులసి నీరు వల్ల కలిగే ప్రయోజనాలు గురించి మీకు తెలుసా?
భారతదేశంలో హిందువులు తులసి మొక్కను పరమపవిత్రంగా భావిస్తూ ఉంటారు. తులసి మొక్కను దేవతగా భావించి
- Author : Anshu
Date : 18-04-2023 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
భారతదేశంలో హిందువులు తులసి మొక్కను పరమపవిత్రంగా భావిస్తూ ఉంటారు. తులసి మొక్కను దేవతగా భావించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా తులసి మొక్కను పూర్వం నుంచి ఆయుర్వేదంలో మందులు తయారీలో ఉపయోగిస్తూనే ఉన్నారు. తులసి మొక్క సర్వరోగ నివారిణి అని చెప్పవచ్చు. తులసిని తీసుకుంటే జలుబు, దగ్గు వంటి రోగాలు దరిచేరవు. జీర్ణ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కేవలం తులసి ఆకుల వల్ల మాత్రమే కాకుండా తులసి నీరు వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
మరి తులసి ఆకు తులసి నీరు వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పరగడుపున తులసి నీరు తాగడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. తులసి ఆకులను తింటే శరీరం శుభ్రంగా ఉంటుంది. అలాగే తులసి శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. శరీర బరువును కూడా తగ్గిస్తాయి. శరీరంలో కొవ్వు పదార్థాలను పేరుకుపోకుండా అడ్డుకుంటాయి. అలాగే వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు తులసి ద్వారా చెక్ పెట్టవచ్చు. తులసి నీటిని మరిగించి తాగడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా జలుబు, గొంతు సమస్యను ఎదుర్కోవచ్చు.
కాగా అసిడిటీ సమస్య ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 2 లేదా 3 తులసి ఆకులను నోటిలో వేసుకుని నమలాలి. కడుపు నొప్పితో బాధపడేవారు మంచినీళ్లలో తులసి ఆకుల రసం, నిమ్మరసం కలిపి తాగడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి కూడా ఉపశమనం పొందవచ్చు జీర్ణ సమస్యల నుండి బయటపడటానికి, టీ చేసేటప్పుడు, కొన్ని తులసి ఆకులను వేసి మరిగించి త్రాగాలి. తులసి రసం, తులసి ఆకులను రోజూ తీసుకుంటే రోగాలకు దూరంగా ఉండవచ్చు. ప్రతి రోజు నిద్రలేవగానే తులసి ఆకులను మరిగించిన నీటిని తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. తులసి ఆకులు గుండెల్లో మంట, అజీర్ణం, అసిడిటీ వంటి పలు ఉదర సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. శరీరంలో pH స్థాయులను క్రమబద్ధీకరించడంలో సమర్థంగా తోడ్పడుతాయి.