Thati Kallu: వేసవిలో తాటికల్లు తాగితే వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా?
వేసవిలో లభించే తాటికల్లు తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 02:00 PM, Mon - 24 February 25

మనకు సమ్మర్ లో లభించే వాటిలో తాటి ముంజలు కూడా ఒకటి. వీటిని తాటికాయలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవి వేసవి కాలంలో మాత్రమే లభిస్తూ ఉంటాయి. చాలా రుచిగా ఉండడంతో పాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అయితే కేవలం తాటి కాయల వల్లే మాత్రమే కాకుండా తాటి కల్లు వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు. మరి తాటి కల్లు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తాటి కల్లు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ప్రస్తుత రోజుల్లో ఒరిజినల్ కల్లుకు బదులు చాలా వరకు కల్తీ కల్లు లభిస్తోంది. అయితే అందుకే ఎప్పుడూ కల్లు తాగిన చెట్టుపై నుంచి అప్పటికప్పుడు తీసే కల్లు మాత్రమే తాగాలని చెబుతుంటారు. ఇలా అప్పటికప్పుడు తీసే ఫ్రెష్ కల్లు తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయట. తాటికల్లులో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయట. అంతేకాకుండా విటమిన్ సీ, బీ, ఐరన్, ప్రొటిన్స్ కూడా పుష్కలంగా ఉండటం వలన దీని వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవని చెబుతున్నారు.
మరీ ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో తాటి కల్లు కీలక పాత్ర పోషిస్తుందట. అలాగే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుందట. క్యాన్సర్ కు చెక్ పెట్టడంలో ఇది కీలక పాత్ర పోషించడమే కాకుండా, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు యాంటి బయోటిక్ గా తాటికల్లు పనిచేస్తుందట. ఆహారం జీర్ణం కాకపోవడం మలబద్ధకం, అల్సర్, ఉదర సంబంధిత సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పరగడుపున తాటి కల్లు తాగడం వల్ల కల్లులో ఉండే ఔషధ గుణాలు కడుపును క్లీన్ చేసి సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుందట. అందుకే ఈ తాటికల్లుకు తెలంగాణాలో ఫుల్ డిమాండ్ ఉంటుంది అంటున్నారు నిపుణులు.