Patika Bellam: వేసవిలో పటిక బెల్లం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?
పటిక బెల్లం వల్ల రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే పటిక బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలు తెలియక చాలామంది దీనిని తక్క
- By Nakshatra Published Date - 08:50 PM, Tue - 13 June 23
పటిక బెల్లం వల్ల రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే పటిక బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలు తెలియక చాలామంది దీనిని తక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పట్టిక బెల్లం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. పటిక బెల్లాన్ని వైద్య ప్రయోజనాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. పటిక బెల్లంలో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, అమినో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మాంసాహారంలో దొరికే ముఖ్యమైన విటమిన్, విటమిన్ బి12 పటిక బెల్లంలో ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. పటిక బెల్లంని ఎప్పటినుంచో ఆయుర్వేదంలో కూడా వినియోగిస్తున్న విషయం తెలిసిందే.
కాగా చక్కెరతో పోలిస్తే పటిక బెల్లం తక్కువ తియ్యగా ఉంటుంది. అయినా కూడా ఇందులో బోలెడన్ని ప్రయోజనాలు ఉంటాయి మాంసాహారంలో దొరికే విటమిన్లు పటిక బెల్లం ద్వారా లభిస్తాయి. అయితే అటువంటి పటిక బెల్లాన్ని వేసవిలో తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. టీ, కాఫీ, పండ్ల రసాలలో సాధారణ చక్కెరక బదులు పటిక బెల్లం వాడటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పటిక బెల్లం శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులోని పోషకాల వల్ల వేసవికాలంలో త్వరగా నీరసించి పోకుండా ఉంటారు. పటిక బెల్లంలోని డైజెస్టివ్ ఎంజైమ్ లు స్రావాన్ని ప్రోత్సహించడం ద్వారా జీర్ణవ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఆహారాన్ని త్వరగా, ప్రభావవంతంగా జీర్ణం చేస్తుంది.
పటిక బెల్లం హిమోగ్లోబిన్ స్థాయి పెంచడమే కాకుండా రక్త ప్రసరణని పునరుద్ధరిస్తుంది. పటిక బెల్లం నోటికి తాజాదనం ఇవ్వడమే కాకుండా, సోంపుతో వేసుకుంటే జీర్ణక్రియలో కూడా సహాయం చేస్తుంది. అందులో ఉన్న లక్షణాలు జీర్ణ ప్రక్రియని వెంటనే మొదలుబెట్టిస్తాయి. ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు అవసరమయ్యే కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ పటిక బెల్లంలో పుష్కలంగా ఉంటాయి. పటిక బెల్లంలోని గొప్ప ఔషధ గుణాల వల్ల ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. గొంతు నొప్పి ఉన్నవారు పటిక బెల్లాన్ని చప్పరించడం ద్వారా ఉపశమనం పొందుతారు.
దగ్గుతో బాధపడే వారికి పటిక బెల్లం ద్వారా ఫలితం కనిపిస్తుంది. పటిక బెల్లంలోని ఔషధ గుణాలు, పోషకాల వల్ల దీనిని తీసుకున్న వెంటనే శక్తిని ఇస్తుంది. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పటిక బెల్లంలో గ్లైసిరైజిన్ అనే సహజ సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. పటిక బెల్లంలోని పోషకాలు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ఒత్తిడితో ఉన్న వారు చిటికెడు పటికెడు బెల్లాన్ని చప్పరిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.
Related News
Benefits Of Kundru: దొండకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. దొండకాయలో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణ ప్రక్రియను సజావుగా అమలు చేయడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం మరియు అపానవాయువు వంటి సమస్యలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.