Health Benefits: నేల ఉసిరి సర్వరోగ నివారిణి అని మీకు తెలుసా.. వీటి వల్ల కలిగే లాభాలు ఎన్నో?
నేల ఉసిరి మొక్క.. ఈ మొక్క మనకు పల్లెటూరి ప్రాంతాలలో ఎక్కడ చూసినా కూడా రోడ్డుకి ఇరువైపులా పొలాల గట్టున కనిపిస్తూ ఉంటుంది. అయితే చాలామంది
- By Anshu Published Date - 04:30 PM, Sun - 14 January 24

నేల ఉసిరి మొక్క.. ఈ మొక్క మనకు పల్లెటూరి ప్రాంతాలలో ఎక్కడ చూసినా కూడా రోడ్డుకి ఇరువైపులా పొలాల గట్టున కనిపిస్తూ ఉంటుంది. అయితే చాలామంది ఈ నేల ఉసిరిని పిచ్చి మొక్క అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ నేల ఉసిరి మొక్క వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే. అంతేకాకుండా నేల ఉసిరి మొక్క సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందట. నేల ఉసిరి ఆకులను జ్యూస్ గా చేసుకొని తాగడం వల్ల పొత్తి కడుపు మంట తగ్గుతుంది. అలాగే మూత్ర విసర్జన, మూత్ర ఇన్ఫెక్షన్ లను తగ్గిస్తుంది. అంతే కాకుండా శరీరంపై వచ్చే పూతలు, గాయాలు, గజ్జి వంటి వాట చికిత్సలో నేల ఉసిరిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
దీర్ఘ కాలిక గాయాలు, అటోపిక్ చర్మశోథ, ప్రురిటస్, చర్మపు పూతలు వంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు నేల ఉసిరి కాయల రసం చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాలేయం నుంచి పిత్త ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణక్రియను నిర్వహిస్తుంది. కాలేయ పనితీరును మెరుగు పరచడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నేల ఉసిరి జ్యూస్ తాగడం వల్ల కిడ్నీలో ఉండే రాళ్లు కరిగిపోతాయి. అంతే కాకుండా కిడ్నీలో ఏర్పడే ఇతర రకాల సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ రసం హైపర్ కాల్సియురియా, హైపోమాగ్నెసి యూరియా మొదలైన జీవక్రియ అసాధారణతలపై ప్రతిభావంతంగా పనిచేస్తుంది.
అలాగే కామెర్లు, హెపటైటిస్, కాలేయ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాలేయం సమస్యల వల్ల వచ్చే కంటి సమస్యలకు చికిత్స చేసేందుకు నేస ఉసిరి రసాన్ని ఉపయోగిస్తుంటారు. ఉదయం పరగడుపున గోరు వెచ్చని గ్లాసు నీళ్లలో ఈ రసాన్ని కలిపి తాగడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మధుమేహానికి కూడా ఈ జ్యూస్ అధ్భుతంగా పనిచేస్తుంది. నేల ఉసిరి రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే శక్తిని కల్గి ఉంటుంది. దీని చేదు డయాబెటిక్ సమస్యల నుంచి ఉపశమనం కల్గజేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. పిత్త బ్యాలెన్స్ ను పునరుద్ధరించడానికి నేల ఉసిరి రసం ప్రసిద్ధి చెందింది. శరీరంలో ఏర్పడే ఎసిడిటీ, ఆమ్లత్వం నుంచి ఉపశమనం పొందడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈ జ్యూస్ తాగడం వల్ల చర్మం వచ్చే దురద, గజ్జి, తామర వంటి వాటికి చెక్ పెట్టి ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే పైన చెప్పినటువంటి సమస్యలతో బాధపడే వాళ్లు నేస ఉసిరి జ్యూస్ ను తరచుగా తీసుకుంటూ ఉంటారు.