Fennel: సోంపు వాటర్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
కేవలం సోంపు తినడం వల్ల మాత్రమే కాకుండా సోంపు నీళ్లు తాగడం వల్ల కూడా ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 01:00 PM, Sat - 22 March 25

సోంపు గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. సోంపుని కొన్ని రకాల వంటల్లో మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. లేదంటే ఏదైనా రెస్టారెంట్ కి వెళ్లినప్పుడు మసాలా ఐటమ్స్ వంటివి తిన్న తర్వాత ఈ సోంపును తినడానికి ఇస్తూ ఉంటారు. కడుపు నిండుగా భోజనం చేసిన తర్వాత కొద్దిగా నోట్లో వేసుకోవడం వల్ల ఎలాంటి దుర్వాసన రాదు. అలాగే ఆహారం కూడా తొందరగా జీర్ణం అవుతుంది. అయితే ఇప్పటి వరకు సోంపు గింజలు ప్రతి ఒక్కరు తినే ఉంటారు. ఎప్పుడైనా సోంపు ను నీటిలో మరిగించి తీసుకున్నారా. ఒకవేళ అలా తీసుకోకపోతే వెంటనే తీసుకోండి.
ఇలా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. మరి సోంపు వాటర్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామందికి అరుగుదల సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండిన స్వభావం కలుగుతూ ఉంటుంది. అటువంటివారు రోజు సోంపు మరిగించిన నీరు తాగడం మంచిదని చెబుతున్నారు. రాత్రి సొంపు గింజలను నీటిలో నానబెట్టి మరసటి రోజు ఉదయాన్నే తాగడం వల్ల అరుగుదల సమస్యలు తగ్గిపోతాయట. తిన్న ఆహారం కూడా సులభంగా జీర్ణం అవుతుందని చెబుతున్నారు. తిన్న తర్వాత పొట్ట అంతా బరువుగా హెవీగా ఉన్నట్లు అనిపిస్తే చిన్న గ్లాసులో సోంపు కలిపి అనిరు తాగితే పొట్ట నార్మల్గా అనిపిస్తుందని చెబుతున్నారు.
చాలా మంది బరువు తగ్గేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ సోంపు వాటర్ తాగితే సులభంగా బరువు కూడా తగ్గవచ్చట. సోంపు వాటర్ లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. మనకు ఫుడ్ క్రేవింగ్స్ ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా రోజూ ఉదయాన్నే ఈ సోంపు వాటర్ తాగడం వల్ల ఇది మంచి డీటాక్సిక్ డ్రింక్ గా సహాయపడుతుందట. శరీరంలోని టాక్సిన్స్ అన్నింటినీ తొలగిండచంలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. అయితే తరచుగా ఈ నీటిని తాగడం వల్ల బరువు తగ్గడం చాలా సులభం అవుతుందట. ఈ రోజుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా ఏవైనా వచ్చినా వాటిని తట్టుకోవాలన్నా మనకు ఇమ్యూనిటీ పవర్ చాలా ముఖ్యం అని చెబుతున్నారు. సీజనల్ గా పిల్లలు, పెద్దలకు వచ్చే జలుబు, ఫ్ల్లూ వంటివి రాకుండా ఆపడంలో ఈ సోంపు వాటర్ కీలకంగా పని చేస్తుందట. అంతేకాదు చాలా రకాల ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉంచుతుందని చెబుతున్నారు.