Blue Tea: నీలం టీ వల్ల కలిగే లాభాల గురించి మీకు తెలుసా?
శంఖుపుష్పం దీనినే దేవతార్చనలో ఎక్కువగా వాడుతుంటాం. శుంఖుపుష్పాన్ని అపరాజిత, గిరికర్ణిక, దింటెన అని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తూ
- By Anshu Published Date - 10:20 PM, Thu - 24 August 23

శంఖుపుష్పం దీనినే దేవతార్చనలో ఎక్కువగా వాడుతుంటాం. శుంఖుపుష్పాన్ని అపరాజిత, గిరికర్ణిక, దింటెన అని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ పువ్వుని పూజలో ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. కేవలం పూజకు మాత్రమే కాకుండా ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఆయుర్వేద ప్రకారం ఈ శంకు పుష్పాల టీని తరచుగా తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. ఈ టీని ఎండిన శంఖుపుష్పాలతో తయారు చేస్తారు. ఇది నీలం రంగులో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ టీ శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఈ నీలి రంగు టీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శంఖుపుష్పం టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీసే హానికరమైన పదార్థాలు. ఖాళీ కడుపుతో వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఒక కప్పు టీ తాగితే జీర్ణక్రియలో పేరుకున్న టాక్సిన్స్ తొలగుతాయి. ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎసిడిటీ, మలబద్ధకం, గ్యాస్, కడుపుఉబ్బరం వంటి సమస్యలు నయం అవుతాయి. అలాగే బరువు తగ్గాలి అనుకునే వారికీ ఈ టీ ఎంతో బాగా సహాయపడుతుంది.
శంఖుపువ్వుల టీలో కెఫిన్ ఉండదు. అలాగే కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, కొలెస్ట్రాల్ ఉండవు. ఇది బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. ఇది జీర్ణక్రియ నుంచి ఆహార వ్యర్థాలు, టాక్సిన్స్‌ను తొలగిస్తాయి, అలాగే ఆకలిని నియంత్రిస్తుంది. చిరుతిండ్లు తినాలనే కోరికను తగ్గిస్తుంది. శంఖుపుష్పం టీ మీ బరువును కంట్రోల్‌లో ఉంచే ఒక అద్భుతమైన హెర్బల్ డ్రింక్. ప్రతిరోజూ శుంఖు పుష్పాల టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా నివారిస్తుంది. ఈ టీలో ఫినోలిక్ యాసిడ్, ఫినాలిక్ అమైడ్ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీహైపెర్గ్లైసీమిక్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తాయి, గ్లూకోజ్ జీవక్రియను నియంత్రిస్తాయి. ఉపవాసం ఉన్నప్పుడు, భోజనం చేసిన తర్వాత శరీర కణాల ద్వారా చక్కెరలను అధికంగా శోషించడాన్ని నిరోధిస్తుంది
శంఖు పుష్పాల టోలో బలవర్ధకమైన బయోఫ్లావనాయిడ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. దీనిలోని యాంటీ హైపెర్లిపిడెమిక్ లక్షణాలు కొలెస్ట్రాల్ వాల్యూమ్‌లను, రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గిస్తాయి. రోజూ ఈ టీ తాగితే.. హానికరమైన ట్రైగ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్ సాంద్రతలు తగ్గుతాయి. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది క్రమంగా, అథెరోస్క్లెరోసిస్, హార్ట్ ఎటాక్, ధమనులలో రక్తం గడ్డకట్టడం, హైపర్‌టెన్షన్ వంటి తీవ్ర అనారోగ్యాల నుంచి రక్షిస్తుంది. శంఖు పుష్పాలలో ఉండే ప్రోయాంతోసైనిడిన్ కాంప్లెక్స్‌లు కంటి చూపును మెరుగుపరుస్తాయి.