Gongura: గోంగూరతో డయాబెటిస్ ను కంట్రోల్ చేయవచ్చా?
గోంగూర వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిపారు.
- By Anshu Published Date - 11:30 AM, Thu - 14 November 24

మార్కెట్లో మనకు ఎన్నో రకాల ఆకుకూరలు లభిస్తూ ఉంటాయి. వాటిలో గోంగూర కూడా ఒకటి. ఈ గోంగూరనే గోగాకు అని కూడా పిలుస్తూ ఉంటారు. గోంగూరను ఉపయోగించి ఎన్నో రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా గోంగూరని ఆకుకూరలు రారాజుగా కూడా పిలుస్తూ ఉంటారు. కేవలం వెజ్ మాత్రమే కాకుండా నాన్ వెజ్ లలో కూడా గోంగూరని ఉపయోగిస్తూ ఉంటారు. గోంగూర తినడం వల్ల కేవలం రుచే కాదండోయ్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గోంగూర ఎక్కువగా తింటే వేడి చేస్తుందని చాలా మంది దూరం పెడతారు.
కానీ వారంలో రెండు, మూడు సార్లు ఎలాంటి డౌట్ లేకుండా తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి గోంగూరతో ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గోంగూరలో విటమిన్లు సి, ఎ, కె, బి1, బి2, బి9లు ఉంటాయి. అలాగే క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, కెరోటిన్, ఐరన్, రెబోఫ్లేవిన్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయని చెబుతున్నారు. అలాగే గోంగూర తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుందట. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే సీజనల్ వ్యాధులు రావట.
రక్త హీనత సమస్యతో బాధ పడేవారు గోంగూర తింటే చక్కగా రక్తం పడుతుందట. కంటి చూపు సమస్యలు ఉన్నవారు కూడా గోంగూర తింటే దృష్టి లోపాలు తొలగుతాయని చెబుతున్నారు. డయాబెటీస్ ఉన్నవారు కూడా గోంగూర తినవచ్చట. గోంగూర రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి షుగర్ లెవెల్స్‌ని తగ్గించి షుగర్‌ని కంట్రోలో ఉంచుతుందని చెబుతున్నారు. గోంగూర తింటే ఎముకలు కూడా బలంగా ఉంటాయట.