Mango: సమ్మర్ లభించే మామిడి పండు వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు!
సమ్మర్ లో లభించే మామిడి పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. వీటి వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే తినని వారి సైతం తినడం మొదలుపెడతారట.
- By Anshu Published Date - 01:00 PM, Wed - 23 April 25

వేసవికాలం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పండ్లు మామిడి పండ్లు. పండ్లలో మామిడి పండును రారాజుగా కూడా పిలుస్తూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరూ మామిడిపండ్లను ఇష్టంగా తింటూ ఉంటారు. మామిడి పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మామిడి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు. అయితే చాలామంది మామిడికాయలు తినడానికి ఎంత ఇష్టపడరు. కానీ వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం తినకుండా అస్సలు ఉండలేరు.
మరి వేసవిలో దొరికే మామిడి పండ్ల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే.. మామిడి పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుందట. అలాగే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుందని,ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. వ్యాధులతో పోరాడే శక్తిని కూడా అందిస్తుందట. మామిడిలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయట.
బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఎ గా మారుతుందని, మామిడిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వయస్సు సంబంధిత మచ్చల క్షీణత వంటి కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు. కాగా మామిడి పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుందట. ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుందని,ప్రేగు కదలికలను సులభతరం చేస్తుందని, అంతేకాకుండా మామిడిలో ఉండే ఎంజైమ్ లు ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయట. పోషకాలు మరింత సమర్థవంతంగా గ్రహించబడతాయని చెబుతున్నారు. మామిడిలో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయట. ఇవి ఆరోగ్యకరమైన రక్తపోటు స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయని చెబుతున్నారు.
పొటాషియం శరీరంలోని సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తుందట. తద్వారా అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని, మామిడిలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. మామిడిలో క్వెర్సెటిన్, ఐసోక్వెర్సిట్రిన్, ఆస్ట్రాగాలిన్, ఫిసెటిన్, గాలిక్ యాసిడ్ వంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయట. ఈ కణాల నష్టాన్ని నివారిస్తాయట. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. మామిడిలో విటమిన్ సి, విటమిన్ ఎ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడానికి సహాయపడతాయట. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరం, ఇది చర్మాన్ని దృఢంగా సాగేలా ఉంచుతుందట యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయని చెబుతున్నారు.