Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా
ఉదయాన్నే పరగడుపున జీలకర్ర వాటర్ ను ఖాళీ కడుపుతో తాగితే అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని, శరీరంలో కూడా పలు రకాల మార్పులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:30 AM, Sun - 29 December 24

భారతీయుల వంటకాలలో ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా జీలకర్ర ఉంటుంది. జీలకర్ర నువ్వు చాలా రకాల వంటల్లో పోపుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఆహారానికి రుచి పెంచడం మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జీలకర్రలో పాలీ ఫెనాల్స్, శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధించే అనేక ఇతర సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. వివిధ రకాల జీర్ణ సమస్యలను దూరం చేయడంలో జీలకర్ర నీరు ఎంతో బాగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీలకర్ర నీటి వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే..
మంచి జీర్ణవ్యవస్థ సమర్థవంతమైన బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మెరుగైన జీర్ణక్రియ జీవక్రియ రేటును మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో కూడా జీలకర్ర నీరు అద్భుతంగా సహాయపడుతుందట. అలాగే శరీరంలోని అధిక కొవ్వును తగ్గించడంలో జీలకర్ర సహాయపడుతుందని చెబుతున్నారు. జీలకర్ర నీరు తాగటం వల్ల శరీరం కొత్త, ఆరోగ్యకరమైన కణాలను ఉత్పత్తి చేస్తుందట. అలాగే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని,జీవక్రియ రేటును కూడా పెంచుతుందని, జీలకర్ర నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. కాగా జీలకర్రలోని ఫ్లేవనాయిడ్స్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి.
జీలకర్ర టైప్ 2 డయాబెటిస్ లో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సీరం ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుంది. జీలకర్రలో ఉండే ఐరన్, పీచు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, సీజనల్ వ్యాధులతో పోరాడటానికి బాగా ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు జీలకర్ర నీరు తాగడం వల్ల మీ పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుందట. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్న జీలకర్ర వాటర్ ను ఉదయాన్నే తాగి ఎన్నో రకాల ప్రయోజనాలను పొందండి. అయితే జీలకర్ర నీరు తాగే మందు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి.