Orange Juice: ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
ఆరెంజ్ జూస్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని, ఈ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:42 PM, Fri - 20 December 24

సిట్రస్ పండ్లలో ఒకటైన ఆరెంజ్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆరెంజ్ లో ఎన్నో రకాల ప్రయోజనాలు దాగున్నాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తరచుగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అలాగే చర్మం కూడా ఆరోగ్యంగా ఉంచడానికి ఈ పండు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం తరచుగా ఈ ఆరెంజ్ జ్యూస్ తాగాలని నిపుణులు చెబుతున్నారు.
ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి, పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ జ్యూస్ లో మన శరీరానికి అవసరమైన క్యాల్షియం, విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటాయి. మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి రోజూ ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగడం మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఈ ఆరెంజ్ జ్యూస్ మన మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరెంజ్ జ్యూస్ ను కూడా రెగ్యులర్ గా తాగడం వల్ల గుండె ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి చాలా చాలా అవసరం. అందుకే ప్రతిరోజూ ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుందట.
అంతేకాదు కాంతివంతంగా కూడా కనిపిస్తుందని చెబుతున్నారు. నారింజ తొక్కలో కూడా ఎన్నో రకాల ఔషద గుణాలు ఉంటాయి. నారింజ తొక్క మొటిమలను తొలగించడానికి, నల్లటి మచ్చలను పోగొట్టడానికి, జిడ్డుగల చర్మాన్ని తొలగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం నారింజ తొక్కను ఎండబెట్టి పొడి రూపంలో తీసుకోవాలి. పొడి చేసిన నారింజ తొక్కలను గాలివెళ్లని కంటైనర్ లో నిల్వ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఉపయోగించి ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక చెంచా నారింజ పొడిలో చిటికెడు పసుపు, ఒక చెంచా తేనె కలిపి పేస్టులా చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత రోజ్ వాటర్ తో కడిగేయాలి. ఈ ప్యాక్ చుండ్రును తొలగించి ముఖాన్ని కాంతివంతం చేయడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. కాబట్టి ఆరెంజ్ జ్యూస్ ని తరచుగా తీసుకోవడం చాలా మంచిది. ఇది ఆరోగ్యాన్ని అలాగే చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది.