Banana: ప్రతీరోజు ఒక అరటిపండు తింటే ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?
అరటిపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఎన్నో ప్రయోజనాలు కలిగిన అరటిపండు రోజు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 12:00 PM, Mon - 20 January 25

సీజన్లతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా అన్ని సీజన్లలో లభించే పండ్లలో అరటిపండు మొదటి స్థానంలో ఉంటుంది. అరటి పండు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అరటిపండు డైట్ లో భాగంగా చేర్చుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ప్రతిరోజు అరటిపండు తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బాగా పండిని అరటిపండును తింటే లూకోసైనడిన్ అనే కెమికల్ మన జీర్ణ వ్యవస్థకు చక్కటి లాభాన్ని కలిగిస్తుంది.
కడుపులో మ్యూకస్ సెక్రిషన్ తప్పకుండా జరగాలి. ఈ మ్యూకస్ సెక్రిషన్ జరిగేలా అరటి పండు దోహదపడుతుందట. ఈ మ్యూకస్ సెక్రిషన్ తగ్గితే పొట్టలో అల్సర్లు వస్తాయట. అలాగే పొట్టకు రక్షణని అరటి పండు పెంచుతుందట. అరటిపండు లో ఫైబర్ లు పుష్కలంగా వుంటాయి. ఇవి జీర్ణ ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అలాగే ఫైబర్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుందట. దీని వల్ల మలబద్దకం సమస్య కూడా తగ్గుతుందట. అరటిపండు మీ గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందట. అరటి పండులో పొటాషియం మినరల్స్ ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడం లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అరటి పండులో పొటాషియం ఎక్కువగా సూర్యం తక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తపోటు పెరగకుండా అదుపులో ఉంటుంది. కిడ్నీలు ఆరోగ్యంగా పనిచేయాలంటే శరీరంలో మూత్రపిండాలు ఆరోగ్యంగా వుండాలి. వారానికి 5 అరటిపండ్లు తినేవారి కిడ్నీలు చాలా ఆరోగ్యంగా ఉంటాయట. అలా వారానికి కనీసం ఐదు అరటి పండ్లు తినే వారికి కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుందట.వ్యాయామం చేసిన తరువాత కండరాలను తిరిగి మామూలు స్థితిలోకి తీసుకొని రావాలి. ఇలా తీసుకొని రావడంలో పొటాషియం కీలకంగా పనిచేస్తుంది. అరటిపళ్లలో ఈ పొటాషియం పుష్కలంగా వుంటుంది. కాబట్టి వ్యాయామం చేసిన తరువాత ఒక అరటిపండు తినాలని చెబుతున్నారు.