Amarnath Leaves: తోటకూర తింటే నిజంగానే షుగర్ కంట్రోల్ అవుతుందా?
తోటకూర తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెవుతున్నారు.
- By Anshu Published Date - 10:42 AM, Mon - 5 August 24

మార్కెట్ లో మనకు చాలా రకాల ఆకుకూరలు లభిస్తూ ఉంటాయి. వాటిలో తోటకూర కూడా ఒకటి. తోటకూరను తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల లాభాలు కలుగుతాయని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. అందుకే కాయగూరలతో పాటు అప్పుడప్పుడు ఆకుకూరలు కూడా తీసుకోవాలని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా తోటకూర తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. తోటకూర కూడా తినడానికి చాలా రుచిగా ఉంటుంది.
ఇది ఎరుపు ఆకుపచ్చ ఉదా రంగులో కనిపిస్తుంది. ఇందులో కాల్షియం మెగ్నీషియం విటమిన్ ఏ ఐరన్ జింక్ వంటి పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఈ ఆకుకూరను తరచుగా తీసుకోవడం వల్ల ఎముకలకు కావాల్సిన కాల్షియం అంది గట్టిగా మారుతాయి. అంతే కాకుండా షుగర్ కంట్రోల్ లో ఉంటుందట. ఈ తోటకూర వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎముకలకు బలాన్ని అందించడంలో కీళ్ల నొప్పులను దూరం చేయడంలో ఆకుకూరలు ఎంతో బాగా ఉపయోగపడతాయట. మరి ముఖ్యంగా ఆకుకూరల్లో ఉండే క్యాల్షియం జింక్,కాపర్,మెగ్నీషియం వంటివి ఎముకలను దృఢంగా ఉంచడంతోపాటు కీళ్ల నొప్పులు వంటి సమస్యలను దూరం చేస్తాయట.
రక్తంలో షుగర్ లెవల్స్‌ని తగ్గించడంలో మెంతులు హెల్ప్ చేస్తాయట. ఈ ఆకుల్లోని పదార్థాలు శరీరంలో ఇన్సులిన్‌ని సరైన మొత్తంలో బ్యాలెన్స్ చేస్తాయట. చక్కెర జీవక్రియని మెరుగ్గా చేస్తాయి. దీని వల్ల రక్తంలోని అదనపు చక్కెర శరీరంలోని కణాల్లోకి వెళ్ళి షుగర్ లెవల్స్‌ని ఒక్కసారిగా పెంచదు. దీంతో షుగర్ పేషెంట్స్ రక్తంలో చక్కెర కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు. కాగా తోటకూరలో ఐరన్, విటమిన్ సి, బి9 వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది రక్త హీనత సమస్యని దూరం చేస్తుందట. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల అలసట, బలహీనత, కళ్ళు తిరగడం, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. తోటకూరని తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుందట.
దీనిని తరచుగా తినడం వల్ల కడుపు నొప్పి, అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, గుండెల్లో మంట, విరోచనాలు, యాసిడ్ రిఫ్లక్స్ వంటి అనేక జీర్ణ సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు. ఇది జీర్ణ వ్యవస్థని బలంగా చేసి పోషకాలను అందిస్తుందట. దీంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యని కూడా దూరం చేస్తుందట. తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిదని, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండెని ఆరోగ్యంగా ఉంచి గుండె సంబంధిత సమస్యల్ని దూరం చేస్తాయని, రక్తపోటుని కంట్రోల్ చేస్తుందని చెబుతున్నారు. గుండె కండరాలని బలంగా చేసి రక్త కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుందట. దీంతో గుండెపోటు, రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.
note: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే.