Night Bath: ఏంటి రాత్రి నిద్రపోయే ముందు స్నానం చేస్తే ఏకంగా ఇన్ని ప్రయోజనాలా?
Night Bath: రాత్రిపూట నిద్రపోయే ముందు స్నానం చేస్తే మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు వైద్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- By Anshu Published Date - 09:00 AM, Fri - 28 November 25
Night Bath: ప్రస్తుతం ఉన్న ఉరుకుల, పరుగుల జీవితంలో కనీసం తినడానికి కూడా చాలా మందికి సమయం దొరకడం లేదు. ఇంకొందరికి స్నానం చేయడానికి కూడా సమయం దొరకడం లేదు. ఉదయాన్నే స్నానం చేయడానికి వీలు లేనివారు రాత్రిళ్ళు స్నానం చేస్తున్నారు. ఉదయం మొదలు పెట్టిన హడావుడి రాత్రి వరకు కొనసాగుతుంది. ఆఫీస్ పని, కాలేజీ, ట్రాఫిక్, పొల్యూషన్ వంటివి మన శరీరాన్ని మాత్రమే కాదు, మనసుని కూడా అలసిపోయేలా చేస్తాయి. కాబట్టి శరీరానికి కూడా రిఫ్రెష్ అవసరం.
రాత్రిపూట స్నానం చేయడం కేవలం శుభ్రతకే కాదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రాత్రిపూట స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యం అవుతుందట. రోజు మొత్తం వేడి, చెమట, పొల్యూషన్ కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుందని చెబుతున్నారు. రాత్రి నిద్రకు ముందు చల్లటి లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందట. ఇది మన బ్రెయిన్ కి సిగ్నల్ ఇస్తుంది. దానివల్ల ఈజీగా నిద్ర వస్తుందట. ముఖ్యంగా నిద్రలేమి లేదా టెన్షన్ ఉన్నవారికి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుందట. నీరు కేవలం శరీరాన్ని మాత్రమే క్లీన్ చేయదట. మన ఆలోచనలను కూడా తేలిక చేస్తుందట.
రోజు మొత్తం మనం ఎదుర్కొన్న ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటివి మనలో బరువుగా పేరుకుపోతాయని, రాత్రిపూట స్నానం చేయడం వల్ల ఆ మానసిక భారం తగ్గిపోతుందని, మనసుకు ప్రశాంతత లభిస్తుందని చెబుతున్నారు. నీరు నాడీ వ్యవస్థను శాంతపరుస్తుందట. హార్ట్ బీట్ రేటును సమతుల్యం చేస్తుందట. రోజు మొత్తం మన చర్మంపై దుమ్ము, చెమట, బ్యాక్టీరియా పేరుకుపోతాయని, రాత్రి స్నానం చేయకపోతే ఇవి రాత్రంతా చర్మంపై ఉండి, చర్మ సమస్యలకు దారితీస్తాయని, రాత్రిపూట స్నానం చేయడం ద్వారా ఈ మలినాలు తొలగిపోతాయని, శుభ్రంగా నిద్రపోతే మన నిద్ర కూడా ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు. ఉదయం లేచినప్పుడు ఒక ఫ్రెష్ ఎనర్జీ ఉంటుందట. అంతేకాదు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే కండరాలు సడలుతాయని, నర్వ్స్ రిలాక్స్ అవుతాయని,రోజు మొత్తం కూర్చుని పనిచేసే ఉద్యోగులకైనా, ఎక్కువ శారీరక శ్రమ చేసే కార్మికులకైనా రాత్రి స్నానం శరీరానికి మంచి రిఫ్రెష్ లాగా పనిచేస్తుందని చెబుతున్నారు.