Bottle Gourd: సొరకాయ ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఆ తప్పు చేస్తే విషంతో సమానం!
Bottle Gourd: సొరకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కానీ సొరకాయ విషయంలో చిన్న తప్పులు చేస్తే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 07:00 AM, Sun - 5 October 25

Bottle Gourd: సొరకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. సొరకాయతో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకొని తింటూ ఉంటారు. సొరకాయ అనేక లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అయితే కొంతమందికి సొరకాయ తిన్న తర్వాత గ్యాస్, పొట్ట ఉబ్బరం లేదా అజీర్ణ సమస్య వస్తుంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో తిన్నప్పుడు అలాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
కాగా సొరకాయ చల్లని స్వభావం జీర్ణవ్యవస్థను నెమ్మదింపజేస్తుందట. అదేవిధంగా సొరకాయ రక్తపోటును నియంత్రించడంలో సహాయ పడుతుందని, కానీ అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు బాగా తగ్గవచ్చని పోతున్నారు. తక్కువ రక్తపోటు వల్ల మైకం, బలహీనత, అలసట వంటి సమస్యలు వస్తాయట. సొరకాయలో మూత్రవిసర్జన గుణాలు ఉంటాయి. అంటే ఇది శరీరంలో నీటిని వేగంగా బయటకు పంపుతుందట. ఎక్కువగా తీసుకోవడం వల్ల పదే పదే మూత్ర విసర్జన సమస్య ఏర్పడవచ్చని, దీనివల్ల శరీరం కూడా డీహైడ్రేట్ అవుతుందని చెబుతున్నారు.
కాగా కొంతమందికి సొరకాయతో అలర్జీ ఉండవచ్చు. ఇవి తినప్పుడు చర్మంపై దద్దుర్లు, దురద లేదా మంట వంటివీ వచ్చినప్పుడు వెంటనే తినడం మానేయడం మంచిది అని చెబుతున్నారు. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారు జాగ్రత్తగా తీసుకోవాలట. సొరకాయ ఆరోగ్యానికి మంచిదే కానీ దాని రుచి, మోతాదు, సమయం చాలా ముఖ్యమైనవని. ఎల్లప్పుడూ తాజాగా, చేదు లేని సొరకాయను తీసుకోవాలట. ఎక్కువ మోతాదులో తినడం మానుకోవాలట. అలాగే ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు సొరకాయను తినే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.