HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Benefits And Benefitsdrinking Black Coffee Daily

Black Coffe: రోజూ ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా!

ఎప్పుడు కాఫీ టీ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు బ్లాక్ కాఫీ తాగడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు. మరి బ్లాక్ కాఫీ రోజు తాగితే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 21-05-2025 - 5:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Black Coffe
Black Coffe

ఇటీవల కాలంలో చాలా మంది టీ కాఫీ కి బదులుగా గ్రీన్ టీ బ్లాక్ టీ వంటివి తాగడం అలవాటు చేసుకున్నారు. ఎప్పుడు తాగే టీ కాఫీ లేక బదులుగా కొంచెం ప్రత్యామ్నాయంగా అలవాట్లను చేసుకుంటున్నారు. కాగా బ్లాక్ కాఫీ మంచి సువాసన రుచిని కలిగి ఉంటుంది. ఈ బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్ లాంటి వ్యాధులు దరి చేరవు అని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు బ్లాక్ కాఫీ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బ్లాక్ కాఫీ శారీరక పనితీరును మెరుగుపరుస్తుందట.

ఇందులోని కెఫిన్ స్థాయి నాడీ వ్యవస్థను ప్రేరేపించడంతో పాటు కాలేయంలో కొవ్వు ముప్పును తగ్గిస్తుందట. వ్యాయామం సమయంలో ఎక్కువ సేపు శక్తిని అందించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. వ్యాయామానికి ముందు బ్లాక్ కాఫీని తాగడం వల్ల శరీర పనితీరు 11 నుంచి 12 శాతం పెరుగుతుందట. అలాగే బ్లాక్ కాఫీ మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. కెఫిన్ మెదడులో సెరోటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్మ్సిటర్ల స్థాయిలను పెంచడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందట. అంతే కాకుండా బ్లాక్ కాఫీని తరచుగా తాగడం వల్ల డిప్రెషన్ ప్రమాదం తగ్గి, రోజంతా ఉల్లాసంగా, ఆనందంగా ఉండవచ్చు అని చెబుతున్నారు.

అలాగే బ్లాక్ కాఫీ టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. బ్లాక్ కాఫీని క్రమం తప్పకుండా తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందట. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, క్లోరోజెనిక్ యాసిడ్​ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతో పాటు ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతాయని చెబుతున్నారు. బ్లాక్ కాఫీ బరువు తగ్గడంలో సహాయపడుతుందట. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి జీవక్రియ రేటును పెంచడంతో పాటు ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. బ్లాక్ కాఫీ తరచుగా తాగడం వల్ల మెదడు చురుకుగా ఉంటుందట. అలాగే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందట. బ్లాక్ కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు వాపును నిరోధిచడంతో పాటు గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధుల నుంచి ముందస్తు మరణ ప్రమాదాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • black coffe
  • Black Coffe benefits
  • drink Black Coffe every day
  • health benefits
  • health tips

Related News

Do you know what happens if you drink a cup of black coffee every day?

Black Coffee: రోజూ ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా!

ఇటీవల కాలంలో చాలా మంది టీ, కాఫీకి బదులుగా గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటివి తాగడం అలవాటు చేసుకున్నారు. ఎప్పుడూ తాగే టీ, కాఫీలకు బదులుగా కొంచెం ప్రత్యామ్నాయంగా వీటిని అలవాటు చేసుకుంటున్నారు. కాగా బ్లాక్ కాఫీ మంచి సువాసన, రుచిని కలిగి ఉంటుంది. ఈ బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్ లాంటి వ్యాధులు దరి చేరవు అని నిప

  • Tender tamarind leaves put a stop to those problems...!!

    Tamarind leaves: చింత చిగురు ఆ సమస్యలకు చెక్ పెడుతుంది…!!

Latest News

  • Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో ‘తొక్కిసలాట’ జరిగిందన్న వార్తలను ఒడిశా ప్రభుత్వం ఖండించింది

  • Vivek Oberoi: ‘నేను నటుడిని, రాజకీయ నాయకుడిని కాదు’.. సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షపై వివేక్ ఒబెరాయ్ షాకింగ్ కామెంట్స్

  • Telangana Pensions: కొత్త పెన్షన్లు.. ఒంటరి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

  • Galla Jayadev: నారా లోకేష్ క్షమాపణలపై గల్లా జయదేవ్ ట్వీట్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd