Health Tips: దగ్గు, జలుబు ఉన్నప్పుడు పండ్లను తింటే ఏం జరుగుతుందో తెలుసా?
దగ్గు జలుబు ఉన్నప్పుడు కొన్ని రకాల పండ్లు తీసుకుంటే అంతా మంచే జరుగుతుంది అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 05:30 PM, Fri - 18 October 24

నెమ్మదిగా సీజన్ మారుతోంది. గత కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు తుఫాన్లు పడుతూనే ఉన్నాయి. ఇలా క్లైమేట్ కూల్ గా ఉన్నప్పుడు అలాగే తరచూ వర్షాలు పడుతున్నప్పుడు ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే దగ్గు జలుబు, జ్వరం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే కొందరికి దగ్గు జలుబు సమస్యలు వెంటనే తగ్గుతే, మరికొందరికి నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. కొందరికి వారాల తరబడి దగ్గు జలుబు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఈ దగ్గు జలుబు సమస్యతో ఇబ్బంది పడేవారు చాలా రకాల వాటికి దూరంగా ఉంటారు.
అందులో పండ్లు కూడా ఒకటి. దగ్గు జలుబు చేసినప్పుడు కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉండాలని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. అయితే నిజానికి పండ్లను తినడం చాలా మంచిది. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మనకున్న ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అయితే దగ్గు, జలుబు ఉన్నప్పుడు పండ్లు తింటే కొందరికి దగ్గు, గొంతునొప్పి పెరుగుతాయి. అందుకే ఇలాంటి కొన్ని సమస్యలున్నప్పుడు వీటిని తినకూడని చాలా మంది అంటుంటారు. అయితే దగ్గు, జలుబు ఉన్నప్పుడు పండ్లను తినకూడదు అనడానికి స్పష్టమైన సమాధానం లేదు. ఎందుకంటే పండ్లు తింటే అందరికీ ఒకేలా ఉండదనేది వాస్తవం.
నారింజ, కివీలు, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు లేదా కొద్దిగా ఆమ్ల పండ్లు కొంతమందికి గొంతు నొప్పిని, దగ్గును కలిగిస్తాయి. కానీ చాలా మందికి పెద్దగా ఇబ్బందిని కలిగించవు. ఎలాంటి ఇబ్బంది లేదు అనుకున్న వారు తినవచ్చు కానీ వాటి వల్ల సమస్య ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు తినకపోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే ఫ్రిజ్ లో ఉంచిన పండ్లను లేదా జ్యూస్ లను తాగితే కూడా దగ్గు, జలుబు సమస్యలు మరింత పెరుగుతాయట. అందుకే పండ్లను గానీ, పండ్ల రసాలను గానీ వీలైనంత వరకు గది ఉష్ణోగ్రత వద్దే తీసుకోవాలని చెబుతున్నారు. మీకు సిట్రస్ పండ్ల వల్ల ఇబ్బంది కలిగితే ఈ సమయంలో వాటిని తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు.
మీకు దగ్గు, జలుబు ఉన్నప్పుడు, గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన పండ్లను, ముఖ్యంగా ఆమ్ల రహిత పండ్లను ఎక్కువగా తినడం మంచిది. ఇతర వేరే సమస్యలేం లేకపోతే ఏ పండు అయినా తినవచ్చట. పండ్లు తినడం వల్ల శరీరానికి ఎప్పుడూ మంచే జరుగుతుందని చెబుతున్నారు. అలాగని వీటిని మరీ ఎక్కువగా తినకూడదట. ఎందుకంటే పండ్లలో కూడా నేచురల్ షుగర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుందట. ఈ తీపిని అతిగా తినడం కూడా మంచిది కాదని చెబుతున్నారు. ముఖ్యంగా మీరు డయాబెటిస్ పేషెంట్ అయితే. కాబట్టి దగ్గు జలుబు చేసినప్పుడు కొన్ని రకాల పండ్లు తీసుకోవాలి అనుకున్న వారు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు.