HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Good To Drink Cinnamon Water Before Be

Cinnamon Water: రాత్రి పడుకునే ముందు దాల్చిన చెక్క నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే?

మన వంటింట్లో దొరికే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. దాల్చిన చెక్క వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ దాల్చిన చెక్కను ఎన్నో రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు.

  • Author : Anshu Date : 22-07-2024 - 5:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 22 Jul 2024 05 55 Pm 8586
Mixcollage 22 Jul 2024 05 55 Pm 8586

మన వంటింట్లో దొరికే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. దాల్చిన చెక్క వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ దాల్చిన చెక్కను ఎన్నో రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అంతే కాకుండా పూర్వం నుంచి దాల్చిన చెక్కను ఆయుర్వేదంలో కూడా వినియోగిస్తున్నారు. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న దాల్చిన చెక్క నీటిని రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు వైద్యులు.

మరి రాత్రిపూట పడుకునే ముందు దాల్చిన చెక్క నీరు తాగితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దాల్చిన చెక్క నీరు మధుమేహం ఉన్నవారికి ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. మధుమేహం ఉన్నవారు రాత్రిలో పడుకునే ముందు దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. అలాగే ఈ నీరు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుందట. అందుకే దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుందట.

యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండే దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుందని చెబుతున్నారు. రాత్రి పూట దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందట. అలాగే కడుపు ఉబ్బరం కూడా నియంత్రణలోకి వస్తుందట. గ్యాస్ అజీర్ణంతో పాటుగా మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి దాల్చిన చెక్క నీరు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ఆకలి చాలా వరకు తగ్గుతుంది. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవాలనుకునేవారు దాల్చిన చెక్క నీటిని తాగవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cinnamon
  • Cinnamon Water
  • health benefits
  • health tips

Related News

    Latest News

    • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    • Rajinikanth: స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ.. క్లిష్ట సమయంలో అండగా ఉంటానని హామీ ఇచ్చిన రజనీ

    • TVK VIJAY: విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌

    • Papikondalu: పాపికొండలు విహార యాత్ర తాత్కాలిక నిలిపివేత

    • Hyderabad CP Sumathi: అర్ధరాత్రి నడి రోడ్డుపై మహిళా పోలీస్ కమిషనర్ కు వేధింపులు.. 40 మంది పోకిరీలకు దిమ్మతిరిగే షాక్!

    Trending News

      • AIADMK: తమిళ్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. అన్నాడీఎంకే లో రగడ

      • TVK Vijay Trisha: ఎమ్మెల్యేగా త్రిష అక్కడ నుంచే పోటీ..?

      • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd