Tippa Teega: తిప్పతీగలో ఉండే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు?
సాధారణంగా మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలలో లేదా పొలం గట్లలో ఎన్నో రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి.అయితే మనం వాటిని చూసి పిచ్చి మొక్కలు అని భావిస్తాము.
- By Hashtag U Published Date - 03:00 PM, Tue - 31 May 22
సాధారణంగా మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలలో లేదా పొలం గట్లలో ఎన్నో రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి.అయితే మనం వాటిని చూసి పిచ్చి మొక్కలు అని భావిస్తాము. అయితే మనకు తెలియని విషయం ఏమిటంటే ఈ ప్రకృతిలో మన ఆరోగ్యానికి కావలసిన ఎన్నో ప్రయోజనాలు కలిగించే ఔషధ మొక్కలు పెరుగుతూ ఉంటాయి. ఇలా పెరిగే మొక్కలలో తిప్పతీగ ఒకటి. ఈ తిప్పతీగ మన ఇంటి పరిసర ప్రాంతాలలో పెరుగుతుంది. అయితే దీనిలో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాల్సిందే.
ఈ క్రమంలోనే తిప్పతీగల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? తిప్ప తీగ తినడం వల్ల ఎలాంటి వ్యాధులకూ చెక్ పెట్టవచ్చు అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. నిపుణుల అభిప్రాయం ప్రకారం తిప్పతీగ ఆకులను ప్రతిరోజు రెండు నమిలి తిన్న లేదా వీటిని చూర్ణం రూపంలో లేదా గుళికల రూపంలో తిన్న ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు చెబుతున్నారు. మరి తిప్పతీగలో దాగిఉన్న ఆరోగ్యప్రయోజనాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం…
తిప్పతీగ ఆకులలో ఎన్నోరకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఈక్రమంలోనే ప్రతిరోజూ రెండు ఆకులను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసినంత రోగనిరోధక శక్తి పెంపొందుతుంది.అదే విధంగా సీజన్లలో వచ్చే జలుబు దగ్గు ఇతర ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో తిప్పతీగ కీలకపాత్ర వహిస్తుంది. ఈ ఆకులలో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్, వైరల్,యాంటి ఫంగస్ గుణాలు మన శరీరంలో రోగాలను కలుగజేసే సూక్ష్మజీవులతో పోరాడి వాటిని నాశనం చేస్తాయి.
అజీర్తి సమస్యతో బాధపడేవారు తిప్ప తీగ చూర్ణంలో కాస్త బెల్లం కలుపుకుని ప్రతిరోజూ తినడం వల్ల సమస్యలు తొలగిపోయి జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది.ఇక మధుమేహ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజూ ఉదయం సాయంత్రం తిప్ప తీగ చూర్ణం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నిలకడగా ఉంటాయి. మానసిక ఒత్తిడి ఆందోళనతో బాధపడేవారు అలాగే కీళ్లనొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు పాలలో కాస్త తిప్ప తీగ చూర్ణం కలుపుకొని తాగడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందడమే కాకుండా మానసిక ప్రశాంతత ఉంటుంది. కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని పెంపొందించే లక్షణాలు కూడా ఉంటాయి.ఇలా ప్రతిరోజు తిప్పతీగలను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల చర్మం పై ముడతలు తొలగిపోయి వృద్ధాప్య ఛాయలు కనపడకుండా నిత్యం యవ్వనంగా ఉండేలా చేస్తుంది.
Related News
Calcium Carbide: కాల్షియం కార్బైడ్ అంటే ఏమిటి..? దానితో పండిన మామిడి ఆరోగ్యానికి ఎందుకు హానికరం?
మార్కెట్లోకి మామిడికాయల రాక ఎప్పుడో మొదలైంది. అయితే ఈ రోజుల్లో మార్కెట్లో వస్తున్న మామిడిపండ్లు రసాయనాలతో పండినవే.