French Fries: ఇంట్లోనే సింపుల్ గా ఫ్రెంచ్ ఫ్రైస్ ను తయారు చేసుకోండిలా?
- By Sailaja Reddy Published Date - 10:00 AM, Mon - 4 March 24
పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది ఇష్టపడే స్నాక్ ఐటమ్స్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఒకటి. వీటిని బంగాళదుంపతో తయారుచేస్తారు అన్న విషయం తెలిసిందే. క్రిస్పీగా, టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ ను చూస్తేనే నోట్లో నుంచి లాలాజలం వస్తుంటుంది. వీటిని తరుచూ తినాలని ఉన్నప్పటికీ వీటిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలియక చాలామంది తెగ ఆలోచిస్తూ ఉంటారు. అయితే మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
బంగాళదుంపలు, ఉప్పు,కారం, నీరు,ఆయిల్, మొక్కజొన్న పిండి ఇవన్నీ కూడా తగిన మోతాదులో తీసుకోవాలి.
తయారీ విధానం :
ఇందుకోసం పెద్ద సైజు బంగాళాదుంపలను తీసుకొని ఈ బంగాళాదుంపల పొట్టు తీసేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆకారంలో పొడవుగా కట్ చేయాలి. ఆ తర్వాత కట్ చేసిన బంగాళాదుంపలను వెంటనే నీటిలో వేయాలి. దీంతో అవి నల్లగా కావు. ఈ బంగాళాదుంప ముక్కలను నీళ్లలో 5 నుంచి 6 నిమిషాల వరకు ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి.. నీళ్లు వేడయ్యాక కొద్దిగా ఉప్పు వేసి తర్వాత బంగాళాదుంపలు వేసి, 5 నిమిషాల పాటు వాటిని ఉడికించాలి . ఆ తర్వాత బంగాళాదుంప ముక్కలను నీట్లో నుంచి బయటకు తీసి కాటన్ క్లాత్ లో పెట్టి ఆరబెట్టి తర్వాత మొక్కజొన్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో నీళ్లు పోసి సన్నని పేస్ట్ లా చేసుకోండి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేయండి. నూనె వేడయ్యాక బంగాళాదుంప ముక్కలను మొక్కజొన్న పిండి పేస్ట్ లో ముంచి నూనెలో వేయండి. ఇవి లేత బంగారు రంగులోకి మారిన తర్వాత బయటకు తీసి టిష్యూ పేపర్ పై వేస్తే సీజసలి టేస్టీ టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయినట్టే. ఇక వీటిపైన పైన చాట్ మసాలా, కారం వేసి బాగా కలపండి. ఆ తర్వాత టమాటా సాస్ తో వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఇంతే.. మార్కెట్ లో దొరికే ఫ్రెంచ్ ఫ్రైస్ ను మీరు ఇలా ఈజీగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.
Related News
French Fries : ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టమా..? అయితే ఆరోగ్య సమస్యలు గ్యారెంటీ!
మనం ప్రతిరోజూ ఇంట్లో ఉపయోగించే కూరగాయల్లో బంగాళదుంప ఒకటి. బంగాళదుంపలు వండినప్పుడు మెత్తగా, టేస్టిగా ఉంటాయి...కాబట్టి వాటిని ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతుంటాం. అంతేకాదు బంగాళదుంప చిప్స్ ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు చాలా మంది.