Chia Seeds: చియా సీడ్స్ ఆరోగ్యానికి మంచివే కానీ.. వీటితో కలిపి అస్సలు తినకూడదట!
చియా సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ వీటిని కొన్నిటింతో కలిపి అస్సలు తినకూడదని అది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
- By Anshu Published Date - 01:00 PM, Mon - 14 April 25

చియా సీడ్స్.. వీటిని కొందరు తరచుగా తీసుకుంటే మరి కొందరు ఎప్పుడో ఒకసారి మాత్రమే వినియోగిస్తూ ఉంటారు. ఈ చియా ఫుడ్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని సరైన పద్ధతిలో తీసుకున్నప్పుడే మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. లేదంటే లేనిపోని సమస్యలు వస్తాయని చెబుతున్నారు. వాటిని తినడంలో తెలియకుండా చేసే తప్పుల వల్ల కూడా అంతే నష్టం జరుగుతుందట. చియా సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం, జీర్ణ సమస్యలు వంటివన్నీ దూరమవుతాయట.
ఇకపోతే చియా సీడ్స్ ని వేటితో కలిపి తినకూడదు అన్న విషయానికి వస్తే..
కెఫిన్ ఉన్న బేవరేజెస్ డ్రింక్స్ అంటే కాఫీ, ఎనర్జీ డ్రింక్స్‌ని అస్సలు తీసుకోకూడదట. దీని వల్ల డీహైడ్రేట్ అవుతారట. కెఫైన్ కలిపిన డ్రింక్స్ తో చియా సీడ్స్ ని కలిపితే ఇవి అందువాటిలోని నీటిని అబ్జార్బ్ చేసి ఉబ్బుతాయట. వీటిని జీర్ణం చేసేందుకు డైజెస్టివ్ సిస్టమ్ పాడైపోతుందని చెబుతున్నారు. కాబట్టి వీటి బదులు చియా సీడ్స్ ని నీటితో లేదా హెర్బల్ టీతో కలిపి తీసుకోవాలట. దీని వల్ల హైడ్రేషన్ అందుతుందట. ఆల్కహాలిక్ డ్రింక్స్ తో కూడా చియా సీడ్స్ ని అసలు కలిపి తీసుకోకూడదట. ఆల్కహాల్ మనల్ని డీహైడ్రేట్ చేస్తుంది కాబట్టి మీరు చియా సీడ్స్ ని వీటితో కలిపినప్పుడు జీర్ణ సమస్యలు వస్తాయట. అంతేకాకుండా పోషకాలు కూడా అందవని,అందుకే వీటిని ఆల్కహాల్, ఆల్కహాల్ శాతం ఉన్న వాటితో కలిపి అస్సలు తీసుకోకూడదని చెబుతున్నారు.
అదేవిధంగా కొన్ని రకాల పండ్లతో చియా సీడ్స్‌ని కలిపి తినొచ్చు. కానీ, సిట్రస్ ఫ్రూట్స్ తో అస్సలు మిక్స్ చేయకూడదట. ఎందుకు అంటే ఇందులో అసిడిక్ గుణాలు ఉంటాయి. నారింజ, ద్రాక్ష వంటి వాటితో కలిపి తీసుకున్న జీర్ణ సమస్యలు తలెత్తుతాయట. ఇందులోని అసిడిటీ బ్లోటింగ్, గ్యాస్ సమస్యల్ని పెంచుతాయట. అందుకే వీటితో కాకుండా పండ్లు, ఆపిల్స్ వంటి పండ్లతో తీసుకోవాలని చెబుతున్నారు.
చియా సీడ్స్‌లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థలో కీ రోల్ పోషిస్తుందట. అయితే ఫైబర్ ఎక్కువగా తీసుకున్నా బ్లోటింగ్, మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయట. వీటిని పచ్చి కూరగాయలతో తిన్నప్పుడు ఫైబర్ ఎక్కువగా అందుతుందని చెబుతున్నారు. దీంతో జీర్ణ సమస్యలు కూడా వస్తాయట. జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్థమవుతుందని చెబుతున్నారు.
అలాగే ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తో కూడా చియా సీడ్స్ ని కలిపి అస్సలు తీసుకోకూడదట. ఇందులో అన్‌హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చియా సీడ్స్ అందించే హెల్త్ బెనిఫిట్స్ ని తగ్గిస్తాయట. ఈ ఆహారాలతో చియా సీడ్స్ ని కలిపి తింటే వాటి పోషక విలువలు తగ్గుతాయని, దీంతో కాలక్రమేణా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
చియా సీడ్స్ లిక్విడ్స్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. వీటిని పాలు, పెరుగు వంటి డెయిరీ ప్రోడక్ట్స్ తో కలిపినప్పుడు వీటి టెక్చర్ చాలా థిక్ గా మారుతుందట. దీంతో ఇవి జీర్ణమవ్వడం కష్టంగా మారుతుందట. అదే విధంగా ఎవరికైనా లాక్టోస్ పడని వారు, పాల పదార్థాలు పడని వారు వీటిని తీసుకోవడం వల్ల బ్లోటింగ్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయట. ఒక వేళ మీరు పాలతో కలిపి తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ప్లాంట్ బేస్డ్ మిల్క్ వంటి వాటిని వాడుకోవచ్చని చెబుతున్నారు.