HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Foods That You Should Avoid Eating With Mutton

Mutton: మటన్ తిన్న తర్వాత వీటిని తింటున్నారా.. అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే!

మటన్ ఆరోగ్యానికి చాలా మంచిదని ఎక్కువగా తినే వారు అలాగే మటన్ తో పాటు ఇంకా కొన్ని రకాల ఆహార పదార్థాలు తినేవాళ్లు తప్పకుండా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 14-12-2024 - 12:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Good News For Students
Good News For Students

మటన్ రేట్ ఎంత ఉన్న కొందరికి వారానికి కనీసం రెండుసార్లు అయినా మటన్ ఉండాల్సిందే. ముక్కలేనిదే చాలామందికి ముద్ద కూడా దిగదు. ఇక ఆదివారం వచ్చింది అంటే చాలు రాగి సంగటి ఉండాల్సిందే.. మటన్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మటన్‌ లో వివిధ రకాల సహజమైన, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఒలేయిక్ యాసిడ్, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్, ఇది ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఎముకల ఆరోగ్యానికి కూడా మేలు చేసే కాల్షియం కూడా మటన్‌ లో పుష్కలంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే రెడ్ మీట్ ఎక్కువగా తినకూడదట. అంతేకాకుండా మటన్ తిన్న తర్వాత లేదా మటన్‌ తో పాటు కొన్ని తినకూడని ఫుడ్స్ ఉన్నాయి. ఇవి తింటే ఆరోగ్యానికి డేంజర్ లో పడ్డట్టే అని చెబుతున్నారు.

మరి మటన్ తిన్న తర్వాత ఎలాంటి పదార్థాలు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మటన్ మంచిదే కదా అని ఎక్కువగా తింటే అది ఆరోగ్యం పై చెడు ప్రభావాన్ని చూపిస్తుందట. మటన్ ప్రతిరోజు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. మటన్‌ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి సాధ్యమైనంత త్వరగా బర్న్ అవ్వాలి. లేదంటే బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే మటన్ ఎక్కువ తింటే బరువు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మటన్ ఎక్కువ తింటే మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందట. అంతేకాకుండా శరీరానికి వేడి చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే మటన్ ఎక్కువగా తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయట. కాబట్టి మటన్ మంచిదే కదా అని ఎక్కువగా తినడం మంచిది కాదని చెబుతున్నారు.

కాగా మటన్ తిన్న వెంటనే బంగాళదుంప తినకూడదట. ఎందుకంటే చికెన్, మటన్‌లో ప్రోటీన్లు ఎక్కువ. అయితే, బంగాళదుంపలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు కలిపి తింటే అజీర్తి సమస్యలు, వికారం, వాంతులు వచ్చే ప్రమాదముంది. అందుకే వీటిని కలిపి తీసుకోకూడదట.
మనలో చాలా మంది మటన్ తిన్నతర్వాత పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అయితే ఈ కాంబినేషన్ ఏ మాత్రం మంచి కాదని చెబుతున్నారు. పండ్ల రసాలు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు ఎక్కువ అవుతాయని అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా జీర్ణక్రియ మందగిస్తుందట. అంతేకాకుండా టాక్సిన్స్ కూడా విడుదల అవుతాయని, అందుకే మటన్ తిన్న తర్వాత పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ జోలికి పోకూడదని ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. చికెన్, మటన్ ఎక్కువగా తింటే వేడి చేస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఇవి ఎక్కువగా తింటే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ లెవల్స్ పెరుగుతాయట. ఇక తేనె కూడా జీర్ణమవ్వడానికి సమయం పడుతుందట. అందుకే మటన్ తిన్న వెంటనే తేనె తీసుకోకూడదని, ఈ రెండింటి కాంబినేషన్ చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health benefits
  • health tips
  • mutton
  • Mutton benefits

Related News

Hormonal Imbalance

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

నిరంతరం చిరాకుగా ఉండటం, ఆందోళన, డిప్రెషన్, కోపం వంటివి హార్మోన్ల అసమతుల్యత వల్ల కలగవచ్చు. అలాగే నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో సమస్యలు కూడా దీనికి సంకేతాలే.

    Latest News

    • Jobs : నిరుద్యోగులకు గొప్ప శుభవార్త.. రైల్వేలో వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

    • Ustaad Bhagat Singh : తెలంగాణ లో సాధారణ టికెట్ ధరలతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’

    • Donald Trump : ట్రంప్ కు మరో భారీ షాక్

    • Uttam : రబీ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

    • Physics Wala : ఆంధ్రప్రదేశ్‌లో తొలి టెక్-ఎనేబుల్డ్ విద్యాపీఠ్ ప్రారంభం

    Trending News

      • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

      • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd