Foods Items Reheated: ఈ పదార్థాలను పదే పదే వేడి చేస్తున్నారా..? అయితే సమస్యలే..!
టీ, బచ్చలికూర, వంట నూనెలను మళ్లీ వేడి చేయకూడదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. టీని పదే పదే వేడి చేస్తే మీరు అధిక స్థాయి ఎసిడిటీని పొందవచ్చు.
- By Gopichand Published Date - 08:51 AM, Sun - 18 August 24

Foods Items Reheated: ఇంట్లో ఏదైనా ఆహారం లేదా పానీయం మిగిలి ఉన్నప్పుడల్లా మనం వాటిని మళ్లీ తినడానికి భద్రపరుస్తాం. మళ్లీ తినేముందు ఆ పదార్థాలను వేడి చేయడానికి (Foods Items Reheated) ఇష్టపడతాం. అయితే ఆహారాన్ని వేడి చేయడం ఆరోగ్యానికి హానికరం అని మీకు తెలుసా. అయితే ముఖ్యంగా ఈ మూడు ఆహార పదార్థాలను పొరపాటున కూడా వేడి చేసి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహార పదార్థాలు ఏవి..? వాటిని మళ్లీ వేడి చేసి తినడం వల్ల కలిగే నష్టమేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
టీ, బచ్చలికూర, వంట నూనెలను మళ్లీ వేడి చేయకూడదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. టీని పదే పదే వేడి చేస్తే మీరు అధిక స్థాయి ఎసిడిటీని పొందవచ్చు. ఈ టీ తాగడం వల్ల నిద్రలేమి సమస్య కలుగుతుంది. టీలో అధిక మొత్తంలో టానిన్ ఉంటుంది. ఇది శరీరంలో ఐరన్ లోపాన్ని కూడా కలిగిస్తుంది.
వంట నూనె
భారతీయ ఇళ్లలో పూరీలను తయారు చేసినప్పుడల్లా ప్రజలు మిగిలిన నూనెను నిల్వ చేస్తారు. తద్వారా వారు దానిని మళ్లీ ఉపయోగిస్తారు. కానీ అలా చేయడం తప్పు. ఈ నూనెను పదే పదే తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆయిల్ అనేక రకాల సమ్మేళనాలను కలిగి ఉంటుంది. వీటిని మళ్లీ వేడి చేయడం వల్ల ప్రతిచర్య రివర్స్ అవుతుంది. ఈ నూనెను మళ్లీ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
బచ్చలికూర
బచ్చలికూరను పదే పదే వేడి చేయడం వల్ల లిస్టెరియా మోనోసైటోజెన్స్ అనే బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. ఇది బచ్చలికూరను విషపూరితం చేస్తుంది. బచ్చలికూరలో నైట్రేట్, ఐరన్ ఉంటాయి. కాబట్టి బచ్చలికూరను మళ్లీ వేడి చేసిన తర్వాత తినడం ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. అయితే బచ్చలికూర మాత్రమే కాకుండా ఏదైనా ఆకు కూరలను మళ్లీ వేడి చేయడం మానుకోవాలి. ఇవే కాకుండా.. బంగాళదుంపలు, గుడ్లు, మిగిలిపోయిన అన్నాన్ని మళ్లీ వేడి చేయడం కూడా మానుకోవాలి.