Health Tips: పిల్లలకు పాలు ఇచ్చిన తర్వాత వెంటనే ఈ ఫుడ్స్ పెడుతున్నారా.. అయితే జాగ్రత్త!
పిల్లలకు పాలు తాగించిన తర్వాత పొరపాటున కూడా కొన్ని రకాల ఫుడ్స్ ని అసలు పెట్టకూడదని చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:54 AM, Sun - 11 August 24

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా చిన్న పిల్లలు పాలు తాగడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. వైద్యులు కూడా ఎదిగే పిల్లలకు ఖచ్చితంగా ప్రతిరోజు పాలు ఇవ్వమని చెబుతూ ఉంటారు. పాలు తాగడం వల్ల శరీరానికి కావలసిన కాల్షియం అందుతుంది. అయితే పిల్లలకు పాలు ఇవ్వడం మంచిదే కానీ పాలు ఇచ్చిన తర్వాత కొన్ని రకాల ఫుడ్స్ ని అసలు పెట్టకూడదని చెబుతున్నారు. మరి పాలు ఇచ్చిన తర్వాత పిల్లలకు ఎలాంటి ఫుడ్స్ పెట్టకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది తల్లులు పిల్లలకు స్కూల్ కి వెళ్లే ముందు బ్రేక్ ఫాస్ట్ గా ఒక గుడ్డు అలాగే పాలు తాగిస్తూ ఉంటారు.
కానీ పాలు గుడ్డు కాంబినేషన్ అసలు మంచిది కాదని చెబుతున్నారు. ఈ రెండు ఫుడ్స్ తినడానికి కాస్త గ్యాప్ తీసుకోవడం చాలా అవసరం. దాని కడుపు హెవీగా ఉండటంతో పాటు డైజెషన్ సమస్యలు వస్తూ ఉంటాయట. అలాగే మాంసం తిన్నప్పుడు కూడా పాలు తాగకూడదట. అందుకే పాలు తిన్న వెంటనే మీట్ తినకూడదు అని చెబుతున్నారు మీట్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండూ కలిపి తీసుకుంటే శరీరంలో కెమికల్ రియాక్షన్స్ జరిగే ప్రమాదం ఉంది. దాంతో పాటు పిల్లలకు జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలకు పాలు తాగించిన తర్వాత మీట్ వంటివి పెట్టకపోవడమే మంచిది. చిన్నపిల్లలు చేపలు బాగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే చిన్న పిల్లలకు చేపలు తినిపించిన తర్వాత పాలు అస్సలు తాగించకూడదట.
చేపల్లోనూ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చేపలు తిని పాలు తాగితే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. కాబట్టి పిల్లలకు ఈ రెండిటిని కలిపి ఇవ్వకపోవడమే మంచిదని చెబుతున్నారు. అలాగే పాలు తీసుకున్నప్పుడు పెరుగు, పెరుగు తిన్న వెంటనే పాలు అస్సలు తీసుకోకూడదు. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే వాంతులు అవ్వడం.. లేదంటే ఏదైనా అరుగుదల సమస్యలు వస్తాయి. కొంచెం గ్యాప్ ఇచ్చి కూడా తినకుండా ఉండటమే మంచిది. తక్కువలో తక్కువ మూడు, నాలుగు గంటల గ్యాప్ చాలా అవసరం అని చెబుతున్నారు. అదేవిధంగా విటమిన్ సీ ఎక్కువగా పండ్లు అంటే లెమన్, ఆరెంజ్ లాంటివి కూడా పాలతో తీసుకోకూడదు. ఈ పండ్లలో పెరుగులో ఉండే లక్షణాలు ఉంటాయి. ఇవి కూడా కలిపి తీసుకుంటే కడుపులో రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
note: ఈ ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.