Heart Attack : గుండెపోటుకు ఇలాంటి ఆహరం కూడా ఒక కారణమే.. వీటివల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి..
ప్రస్తుత కాలంలో చాలామంది గుండె పోటు(Heart Attack)తో ఎక్కువగా మరణిస్తున్నారు. గుండెపోటు అనేది వయసు(Age)తో సంబంధం లేకుండా ఎవరికైనా రావడం జరుగుతుంది.
- Author : News Desk
Date : 14-06-2023 - 10:00 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుత కాలంలో చాలామంది గుండె పోటు(Heart Attack)తో ఎక్కువగా మరణిస్తున్నారు. గుండెపోటు అనేది వయసు(Age)తో సంబంధం లేకుండా ఎవరికైనా రావడం జరుగుతుంది. అయితే గుండెపోటు రావడానికి ముఖ్యంగా వారి ఆహారపు(Food) అలవాట్లు, మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. మనం అనుసరిస్తున్న జీవనశైలి వలన గుండెపోటు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
మనం తినే ఆహారంలో ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువగా ఉంటె గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. మనం తినే ఆహారంలో ఉప్పు, కారం, మసాలాలు తీసుకోవడం తగ్గించాలి. దీనివలన గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది.
హైబీపీ ఉన్నవారికి కూడా గుండెపోటు తొందరగా వచ్చే అవకాశం ఉంది. హైబీపీ ఉన్నవారు వారి ఆహారాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. అలా కాకుండా మామూలుగా ఆహారంలో అన్ని రకాలు తిన్నట్లైతే వారి గుండెకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. హైబీపీ ఉన్నవారు వారికి బీపీ కంట్రోల్లో ఉన్నా ఆహారంలో చేంజ్ చేయకూడదు వారు తినకూడని పదార్థాలు తినకుండా ఉండాలి లేకపోతే గుండెకు, బ్రెయిన్, కాలేయం వంటి అవయవాలన్నింటికీ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.
మనం ఎప్పుడైనా ఆహారం తిన్న వెంటనే ఒక ఐదు నిముషాలు లేదా పది నిముషాలు వాకింగ్ చేయాలి. అప్పుడు గుండెపోటు సంభవించే ప్రమాదం తగ్గుతుంది.
మన ఆహారంలో కొవ్వు ఉన్న పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి లేకపోతే మన శరీరంలోనికి చెడు కొవ్వు చేరి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కొవ్వు ఉన్న పదార్థాలను మన ఆహారపదార్థాలలో భాగంగా తీసుకోకూడదు.
మద్యపానం మితంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది. మితిమీరి మద్యపానం తాగితే మన గుండెకు మంచిది కాదు. ధూమపానం మన గుండెకు మంచిదికాదు ధూమపానం, మద్యపానం చేసేవారికి కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Also Read : Traffic Noise Vs Heart Attack : ట్రాఫిక్‌లో ఎక్కువ గడిపితే..ఐదేళ్లలో గుండెపోటు?