HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Follow These Tips If You Have Thin Hair

Thin Hair: జుట్టు పలచబడిందా..? ఈ చిట్కాలు పాటించి చూడండి..!!

అమ్మాయిల అందం కేశాల్లోనే ఉంటుంది. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది అమ్మాయిల్లో జుట్టు వూడిపోతోంది.

  • Author : Hashtag U Date : 01-06-2022 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hair Thin
Hair Thin

అమ్మాయిల అందం కేశాల్లోనే ఉంటుంది. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది అమ్మాయిల్లో జుట్టు వూడిపోతోంది. పలచబడటం, చివర్లు చిట్లడం, రాలిపోవడం వంటి సమస్యలు ఎదురువుతున్నాయి. జుట్టు పలచబడినట్లు కనిపిస్తే నలుగురిలో కల్సిందేందుకు వెనకాడుతుంటారు. ఈ నేపథ్యంలో జుట్టు పలచబడినప్పుడు ఎలాంటి చిట్కాలు పాటించాలి. ఒత్తైన కేశసంపద సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

గుడ్డు..తెల్లసొన..
గుడ్డులోని తెల్లసొన తీసుకుని బాగా కలియబెట్టాలి. ఆ మిశ్రమాన్ని కుదుళ్లకు చేరేలా పట్టించి…అర్థగంటపాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీరు, షాంపూతో తలస్నానం చేయాలి. వారానికోసారి ఈ విధంగా క్రమం తప్పకుండా చేసినట్లయితే…ఒత్తైన కేశాలు సొంతం చేసుకోవచ్చు. తెల్లసొన గిలక్కొట్టిన తర్వాత అందులో జుట్టుకు పెట్టుకునే నూనె, కొద్దిగా నీరు జతచేసి…ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు చేరేలా మర్దన చేయాలి. అప్పుడు మంచి ఫలితం ఉంటుంది.

మెంతులు:
జుట్టు పరిమానానికి అనుగుణంగా రెండు కానీ మూడు చెంచాల మెంతులు తీసుకోవాలి. వాటిని నీటిలో 10 గంటలపాటు నానబెట్టాలి. తర్వాత వాటిని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 30 నుంచి 40 నిమిషాలపాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీరు, షాంపూతో శుభ్రం చేసుకోవాలి. మెంతుల మిశ్రమంలో కాస్త కొబ్బరిపాటు కూడా కలిపి కేశాలకు పెట్టుకోవచ్చు.

ఉసిరి, శీకాకాయలతో…
తలస్నానానికి షాంపూలకంటే…సహజసిద్ధంగా తయారు చేసిన ఉసిరి, శీకాకాయ పొడులను ఉపయోగించినట్లయితే…పలచడిన కేశాలను తిరిగి ఒత్తుగా మార్చుకోవచ్చు. కురుల ఎదుగుదలకు అవసరమయ్యే పోషణ అందించడంతోపాటు కుదుళ్లుగా ఒత్తుగా పెరిగేలా చేసతాయి. ఫలితంగా ఆరోగ్యవంతమైన కేశాలను పొందవచ్చు.

ఉల్లిరసం…
ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ కేశాల ఎదుగుదలను బాగా ప్రేరేపిస్తుంది. ఒత్తైన కేశసంపద పొందాలనుకునే వారు వీటిని కూడా తమ చిట్కాల జాబితాలో చేర్చవచ్చు. ఉల్లిరసం తీసుకుని కుదుళ్ల వద్ద మర్దన చేయాలి. పదిహేను నిమిషాలపాటు ఈ విధంగా చేస్తే…జుట్టు తిరిగి పెరుగుతుంది.

కలబంద…
కలబంద గుజ్జును కేశాలకు, కుదుళ్లకు పట్టించాలి. అర్ధగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వారానికోసారి ఇలా చేస్తే మంచి ఫలితం పొందవచ్చు.

ఆముదంతో…
ఆముదం, కొబ్బరినూనె సమపాళ్లలో తీసుకోవాలి. కాస్త వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని చేరేలా చేతివేళ్లతో గుండ్రంగా మర్దన చేసుకోవాలి. కేశాలకు కుదుళ్లకు నూనె సమానం పట్టించేలా చూసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచిన టవల్ తలకు చుట్టాలి. గంటపాటు అలాగే ఉంచాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికోసారి క్రమం తప్పకుండా చేస్తే ఒత్తైన కురులు మీ సొంతం అవుతాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hair thinned
  • hair tips
  • health
  • treatment

Related News

If you want radiant skin and thick hair, you simply must use that oil!

Almond Oil: ప్రకాశవంతమైన చర్మం, ఒత్తైన జుట్టు మీ సొంతం కావాలంటే ఆ నూనె ఉపయోగించాల్సిందే!

మామూలుగా ప్రతి ఒక్కరూ మెరిసే చర్మం అలాగే ఒత్తైన, పొడవాటి జుట్టు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇందుకోసం ఎన్నో వంటింటి చిట్కాలను ఉపయోగించడంతో పాటు రకరకాల బ్యూటీ ప్రోడక్టులను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితాలు లభించలేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో కాలుష్యం, దుమ్ము, ధూళి ఇలా అనేక రకాల కారణాల వల్ల చాలామంది చర్మం అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలతో

    Latest News

    • Bigg Boss Telugu Season 10: ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో బిగ్ బాస్ 10 తెలుగు సీజన్… ఈసారి కంటెస్టెంట్స్ వీళ్లేనా..?

    • Gurugram Encounter: గురుగ్రామ్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు ఎన్‌కౌంటర్

    • Pawan Kalyan: నేడు ముంబై కి పవన్ కల్యాణ్.. భుజానికి సర్జరీ

    • Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

    • Donald Trump: నన్ను హత్య చేయాలని చూస్తోంది.. ట్రంప్‌ షాకింగ్ కామెంట్స్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd