HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Experts Suggest That People With Diabetes Should Not Eat Potatoes

Potato: షుగర్ వ్యాధిగ్రస్తులు ఆలుగడ్డ తినకూడదా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!

మన వంటింట్లో దొరికే కూరగాయల్లో ఆలుగడ్డ కూడా ఒకటి. దీనినే బంగాళదుంప,ఉర్లగడ్డ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ బంగాళదుంప ఎన్నో రకాల కూరల్లో ఉపయోగించడంతో పాటు ప్రత్యేకించి బంగాళదుంపతో కొన్ని రకాల కూరలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే మనలో చాలామం

  • Author : Anshu Date : 08-07-2024 - 11:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 08 Jul 2024 11 24 Am 3964
Mixcollage 08 Jul 2024 11 24 Am 3964

మన వంటింట్లో దొరికే కూరగాయల్లో ఆలుగడ్డ కూడా ఒకటి. దీనినే బంగాళదుంప,ఉర్లగడ్డ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ బంగాళదుంప ఎన్నో రకాల కూరల్లో ఉపయోగించడంతో పాటు ప్రత్యేకించి బంగాళదుంపతో కొన్ని రకాల కూరలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే మనలో చాలామంది ఈ బంగాళదుంప తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ బంగాళాదుంపతో చేసే జంక్ ఫుడ్స్ మాత్రం తెగ ఇష్టపడి తింటూ ఉంటారు. కాగా ఈ బంగాళదుంపలో విటమిన్లు, మినరల్స్‌ సమృద్ధిగా ఉంటాయి. విటమిన్‌ సి, బి6, పొటాషియం, మాంగనీస్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, నియాసిన్‌, ఫోలేట్‌ వంటి పోషకాలు లభిస్తాయి.

విటమిన్‌ బి6 మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఆలుగడ్డల్లో ఉండే రెసిస్టెంట్‌ స్టార్చ్‌ జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే చాలామంది డయాబెటిస్ ఉన్నవారు బంగాళదుంప తినడానికి కాస్త ఆలోచిస్తూ ఉంటారు.. మరి ఈ షుగర్ ఉన్నవారు బంగాళదుంప తినకూడదా? తింటే ఏం జరుగుతుంది? ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బంగాళాదుంపలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు ఆలుగడ్డ తినకపోవడమే మంచిదట. ఎందుకంటే బంగాళదుంపలో ఉండే కార్పోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయని చెబుతున్నారు వైద్యులు. అందుకే షుగర్ ఉన్నవారు తినకపోవడమే మంచిదట. ఆలుగడ్డలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ ఫ్రీరాడికల్స్‌తో పోరాడి కణాల నష్టాన్ని తగ్గిస్తాయి.

పొటాషియం ఎక్కువగా ఉండే ఆలు గడ్డలను తింటే రక్తపోటు అదుపులో ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే
ఊబకాయం, ఎసిడిటీ, మధుమేహం, కీళ్లనొప్పులు లాంటి సమస్యలతో బాధపడేవారు ఆలుగడ్డలను తక్కువ మోతాదులో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ ఫ్రెంచ్‌ఫ్రైస్‌, చిప్స్‌ రూపంలో కాకుండా పొట్టుతో పాటు ఉడికించిన ఆలూ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. ఎప్పుడూ రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నవారు ఆలుగడ్డలను తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు. నిజానికి ఆలుగడ్డలో పొటాషియం, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా బంగాళదుంప పొట్టులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఉడికించిన బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఆలూ మెంతికూర, బెండకాయ వంటి అధిక ఫైబర్ కూరగాయలతో వండటం వల్ల డయాబెటిస్ రోగులు తినొచ్చని చెబుతున్నారు.

Note: ఈ సమాచారం కేవలం ఇంటర్నెట్ నుంచి మాత్రమే సేకరించబడింది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health benefits
  • health tips
  • potato
  • Potato Benefits

Related News

Weight Loss Tips

రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

రంజాన్ మాసంలో 5 కిలోల వరకు బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. దీనికోసం మీరు అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండాలి.

  • Heart Attack Anger

    కేవలం 8 నిమిషాల కోపంతో గుండెపోటు

  • Garlic

    వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

  • Amla Honey Benefits

    ఆరోగ్య సిరి..తేనెలో ఉసిరికాయ‌ల‌ను నాన‌బెట్టి తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

  • I-Pill Side Effects

    ఐ-పిల్ వాడుతున్నారా? అయితే దుష్ప్రభావాలివే!!

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd