Morning Drinks: షుగర్ కంట్రోల్ అవ్వాలంటే ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ డ్రింక్స్ తాగాల్సిందే!
మధుమేహం ఉన్నవారు రక్తంలో షుగర్ అదుపులో ఉండాలి అనుకుంటే అందుకోసం ఉదయాన్నే గాలి కడుపుతో కొన్ని రకాల డ్రింక్స్ ను తాగాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 04:04 PM, Fri - 7 February 25

మధుమేహం ఉన్నవారికి రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడం పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఈ షుగర్ ఎక్కువ అయినా తక్కువ అయినా కూడా చాలా రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. రక్తంలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుకోవడం కోసం రకరకాల డైట్లు ఆహార పదార్థాలు తినడంతో పాటుగా మెడిసిన్స్ ని కూడా వాడుతూ ఉంటారు. రక్తంలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ లో చేయడానికి మార్కెట్లో ఎన్నో రకాల మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆ మెడిసిన్స్ ని తీసుకోవడానికి అంతగా ఇష్టపడని వారు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్స్ ని కాళీ కడుపుతో తీసుకోవాలని చెబుతున్నారు. ఆ డ్రింక్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగాలట. ఈ పానీయం బరువును నియంత్రించడంతోపాటుగా మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుందట.
దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందట. కాబట్టి మీరు త్రాగే టీలో దాల్చిన చెక్కలను లేదా పొడిని కలుపుకొని తాగవచ్చని చెబుతున్నారు. ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయట. మరో డ్రింక్ సీతాఫలం రసం సాధారణంగా డీహైడ్రేషన్ ఉన్న రోగులకు సీతాఫలం తినాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే పరగడుపున సీతాఫలం రసాన్ని తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందట. మెంతికూరలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుందట. మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందట. మీ జుట్టు ఆరోగ్యానికి అద్భుతాలు చేస్తుందని చెబుతున్నారు.
కలబంద రసం.. కలబంద చర్మానికి మంచిది. అలాగే గాయాలకు కూడా సహాయపడుతుంది. ఇది మీ చర్మం జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుందట. రక్తంలో చక్కెరను తగ్గించే ప్రభావాన్ని కలిగి ఉంటుందట. కాబట్టి ఖాళీ కడుపుతో కొద్ది మొత్తంలో కలబంద రసాన్ని తాగడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుందట. తులసి టీ తులసి ఆకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయట. కాబట్టి తాజా తులసి ఆకులను టీలో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయట. ఈ డ్రింక్స్ ని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుందట.