Cool Drinks: వేసవికాలంలో కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా.. అయితే జాగ్రత్తండోయ్.. ఈ ప్రమాదాలు రావచ్చు!
వేసవికాలంలో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వారు కొన్ని రకాల విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 06:00 PM, Sat - 15 February 25

వేసవికాలంలో చాలామంది చేసే పని కూల్ డ్రింకులు ఎక్కువగా తాగడం. ఎండలు మండిపోతున్నాయి అని చల్లగా కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉంటారు. దీని వల్ల లేని పోనీ సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయినప్పటికీ వినిపించుకోకుండా చాలామంది మార్కెట్లో దొరికే కెమికల్ కూల్ డ్రింక్స్ ని తాగుతుంటారు. ఇది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు అని చెబుతున్నారు. ఎందుకంటే వీటిని తాగడం వల్ల లేని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టు అవుతుందని చెబుతున్నారు. కూల్ డ్రింక్స్ ఏడాది పొడువునా లభిస్తూ ఉంటాయి.
సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్ లలో ఇవి లభిస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువ కాలం పాడవకుండా ఉండడం కోసం రకరకాల కెమికల్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి అప్పటికప్పుడు మంచిగా అనిపించినప్పటికీ పోను పోను ఆరోగ్యానికి ఇబ్బంది కలిగిస్తాయని చెబుతున్నారు. ఇలాంటి కూల్డ్రింక్స్ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయట. బరువు అమాంతం పెరిగిపోతుందట. వీటిలో కూల్ డ్రింక్స్ చక్కెర శాతం ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల షుగర్,గుండె సంబంధిత, ఊబకాయం వంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయట.
అయితే బరువు తగ్గాలి అనుకున్న వారు కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. కూల్ డ్రింక్స్ లో సోడా శాతం అధికంగా ఉంటుంది. దీనివల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యి మంది తొందరగా ఆకలి వేస్తుందట. ఫలితంగా ఎక్కువ ఆహారం తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. కూల్ డ్రింక్స్ లో కలిపే కెమికల్స్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు. చల్లగా ఉండి కడుపులోకి వెళ్లి విషం గా మారి ప్రాణాలను తీస్తాయనీ చెబుతున్నారు. ఒకవేళ వేసవి కాలంలో చల్లగా ఏదైనా తాగాలి అనుకుంటే ఇంట్లో తయారు చేసుకున్న ఫ్రూట్ జ్యూస్, చల్లని మజ్జిగ, కొబ్బరి నీళ్లు, లేదంటే నిమ్మకాయ నీరు తాగడం మంచిదని చెబుతున్నారు.