HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Effective Tips To Get Rid Of Constipation

Constipation: మలబద్ధకం నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?

మలబద్ధకం సమస్య ఉన్నవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 07-10-2024 - 11:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Constipation
Constipation

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మలబద్ధకం సమస్య ఒకటి. ఈ మలబద్ధకం సమస్య వచ్చినప్పుడు చాలామంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మలబద్ధకంగా ఉంటే ఆకలి వేసినా, ఏమీ తినాలని, తాగాలని అనిపించదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా పొట్ట సమస్యే అని చెప్పవచ్చు. కాబట్టి వీలైనంత వరకూ ఈ సమస్య నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనడానికి ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు. వాటితో పాటు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా మలబద్ధకంకు దారితీస్తాయట.

నిజానికి మలబద్దకం సమస్య రావడానికి ఎన్నో కారణాలున్నాయి. రోజంతా నీటిని పుష్కలంగా తాగకపోవడం, ఫైబర్ కంటెంట్ ఉండే ఆహారాలను తినకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, కొన్ని రకాల మందుల వాడకం వంటివి మలబద్దకానికి దారితీస్తాయట. అయితే మలబద్దకాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల మందులను వాడుతుంటారు. అయితే ఇంట్లో ఉండే కొన్ని రకాల చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బెల్లం, నెయ్యిని కలిపి తీసుకోవాలని చెబుతున్నారు. బెల్లంలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. నెయ్యిలో మన ఆరోగ్యానికి అవసరమైన కొవ్వులు ఉంటాయి. ఈ కలయిక మృదువైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.

అలాగే మలబద్దకాన్ని కూడా నివారిస్తుందట. అలాగే ఇవి పోషకాల శోషణను పెంచుతాయని చెబుతున్నారు. అలాగే శరీరంలోని విషాన్ని సమర్థవంతంగా బయటకు తొలగిస్తాయట. నిర్జలీకరణం కూడా మలబద్దకానికి కారణం అవుతుంది. అందుకే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పుచ్చకాయను తినాలి. ఇది మీ శరీరాన్నినిర్జలీకరణం నుంచి బయటపడేస్తుంది. దీంతో మలబద్దకం సమస్య తగ్గుతుంది. పుచ్చకాయను ఈవెనింగ్ స్నాక్స్ గా కూడా తినొచ్చు. పుచ్చకాయ సీజన్ లో లేకపోతే బాగా పండిన అరటిపండ్లను తిన్నా సమస్య నుంచి బయటపడతారు. రాత్రి భోజనంలో నువ్వులను చేర్చుకోవడం వల్ల కూడా మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చట. నువ్వుల్లో ఫైబర్, విటమిన్ ఇ, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు ఇవి మీ మొత్తం గట్ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి సహాయపడతాయని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Constipation
  • Constipation problems
  • health tips
  • piles

Related News

Hormonal Imbalance

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

నిరంతరం చిరాకుగా ఉండటం, ఆందోళన, డిప్రెషన్, కోపం వంటివి హార్మోన్ల అసమతుల్యత వల్ల కలగవచ్చు. అలాగే నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో సమస్యలు కూడా దీనికి సంకేతాలే.

    Latest News

    • Donald Trump : ట్రంప్ కు మరో భారీ షాక్

    • Uttam : రబీ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

    • Physics Wala : ఆంధ్రప్రదేశ్‌లో తొలి టెక్-ఎనేబుల్డ్ విద్యాపీఠ్ ప్రారంభం

    • Yezdi : యెజ్డీ రోడ్ స్టర్‌కు ‘బైక్ డిజైన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం

    • CIL : అరుదైన గౌరవం దక్కించుకున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్

    Trending News

      • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

      • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd