Cough: విపరీతమైన దగ్గు సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!
Cough: దగ్గు జలుబు వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలను పాటిస్తే త్వరగా ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 08:00 AM, Sat - 4 October 25

Cough: మామూలుగా సీజన్ మారే సమయంలో వాతావరణంలో మార్పులు కారణంగా జ్వరం దగ్గు జలుబు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్ని సార్లు వాటర్ మారినప్పుడు, ఐస్ క్రీమ్ లు కూల్ డ్రింక్స్ వంటివి తీసుకున్నప్పుడు, వేరే ప్రాంతాల నీరు తాగినప్పుడు తొందరగా దగ్గు జలుబు వస్తూ ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ దగ్గు జలుబు సమస్యలతో తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటారు. జలుబు సంగతి పక్కన పెడితే కొన్ని సార్లు దగ్గు విపరీతంగా ఉంటుంది.
ఊపిరాడకుండా దగ్గు వస్తూ ఉంటుంది. సరిగ్గా నిద్ర పోలేరు. గుండెల్లో నొప్పిగా ఉండడంతో పాటు చాలా అలసటగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మెడిసన్స్, సిరప్లు వాడితో ప్రయోజనంగా ఉంటుంది. కొన్నిసార్లు ఎన్ని సిరప్ లు వాడినా కూడా దగ్గు తగ్గదు. అలాంటప్పుడు కొన్ని ఇంటి చిట్కాలను పాటించి దగ్గు జలుబు కఫం నుంచి ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు. మరి ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు వాపు, నొప్పిని తగ్గిస్తాయట. అయితే తేనె గొంతును మృదువుగా చేస్తుంది.
ఒక టీస్పూన్ అల్లం రసం తీసి అందులో అర టీస్పూన్ తేనె కలిపి రోజుకు 2 సార్లు తీసుకోవడం వల్ల దగ్గు నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. అలాగే అల్లాన్ని నీటిలో వేసి మరిగించి దానిలో తేనె కలిపి తాగితే కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయట. అలాగే పసుపును సహజమైన యాంటీబయాటిక్ గా కూడా చెప్తారు. కాబట్టి రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో అర టీస్పూన్ పసుపు వేసి తాగితే మంచిదట. దీనివల్ల గొంతు నొప్పి, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభించడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందట.
తులసి ఆకులు, మిరియాలు రెండూ దగ్గును నయం చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. కొన్ని తులసి ఆకులను మరిగించి దానిలో మిరియాల పొడి వేసుకుని కొంచెం తేనె కలిపి టీ తయారు చేసుకోవచ్చు. దీనిని రోజూ తాగితే గొంతుకు ఉపశమనం లభిస్తుందట. గొంతు నొప్పి, దగ్గును తగ్గించుకోవాలనుకుంటే మీరు ఆవిరి తీసుకోవచ్చు. దీనికోసం మీరు నీటిని మరిగించి దానిలో వాము లేదా పుదీనా చుక్కలు వేసుకోవాలి. దానిని ఆవిరి తీసుకోవడం వల్ల గొంతు తేమగా మారుతుంది. కఫం సులభంగా బయటకు వస్తుందట. దగ్గు, జలుబు కూడా తగ్గుతుందని చెబుతున్నారు.
గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలించడం వల్ల దగ్గు, గొంతు నొప్పి తగ్గుతుందట.