Curd: మలబద్ధకం డిహైడ్రేషన్ నుంచి ఉపశమనం పొందాలంటే పెరుగులో ఇవి కలిపి తినాల్సిందే?
డిహైడ్రేషన్ మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు వాటి నుంచి ఉపశమనం పొందడం కోసం తెలుగులో కొన్నింటిని కలుపుకుని తినాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:00 AM, Sat - 1 February 25

ప్రస్తుత రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో సరైన సమయంలో భోజనం చేయకపోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో మలబద్ధకం సమస్య కూడా ఒకటి. మలబద్ధకం సమస్య రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అందులో సరైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం ఒకటి అయితే సమయానికి భోజనం చేయకపోవడం కూడా ఒకటి. అలాంటప్పుడు ఎటువంటి అనారోగ్య ప్రయోజనాలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహారపు అలవాట్లు చేసుకోవాలని చెబుతున్నారు.
డైరీ ప్రొడక్ట్స్ లో ప్రోబయోటిక్స్ అధికంగా ఉండటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధకత పెంచుతుందట. అలాగే అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయట. పెరుగులో ప్రోలాక్టిన్, ప్రోబయోటిక్స్ ఉండటం వల్ల ఇవి కలిపి తింటే మలబద్దకం నుండి ఉపశమనం లభిస్తుందట. ప్రతిరోజు ఆహారంలో భాగంగా పెరుగును చేర్చుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. పెరుగులో కాల్షియం ప్రోటీన్లు ఫైబర్ అలాగే ఇతర విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే మలబద్ధకం సమస్యను తగ్గించే తత్వం పెరుగులో ఉంటుంది. మీ ఆహారంలో పెరుగును చేర్చుకోవడం వల్ల మీ ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా మీ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుందట.
ఇది మీ జుట్టు చర్మానికి కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు. పెరుగు దోసకాయ కలిపి తీసుకోవడం వల్ల మలబద్ధకం, డిహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడవచ్చట. అయితే దోసకాయలో మంచి మొత్తంలో నీరు ఉంటుంది. ఈ రెండు విషయాల కలయిక ప్రేగులలో పేరుకుపోయిన మలాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుందట. దీని వల్ల మలబద్ధకం ఉన్నవారు చాలా ప్రయోజనం పొందవచ్చని చెబుతున్నారు. జీర్ణక్రియను మెరుగుపరచడానికి జీలకర్ర, పెరుగు తినాలట. వేయించిన జీలకర్రను గ్రైండ్ చేసి పెరుగులో కలుపుకుని అందులో కొద్దిగా రాళ్ల ఉప్పు లేదా నల్ల ఉప్పు వేసి తింటే జీర్ణశక్తి మెరుగుపడి అజీర్ణం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చట. ఈ విధంగా మీరు మీ ఆహారంలో పెరుగును చేర్చుకుంటే, అది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. పెరుగుతో ఆకుకూరల కలయిక పెరుగుతో సెలెరీని తీసుకోవడం వల్ల మలబద్ధకం అనేక కడుపు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందట. పైల్స్ సమస్యలో ఈ రెండు పదార్థాల కలయిక కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుందని చెబుతున్నారు.