Health Tips: బొప్పాయి,అరటిపండు కలిపి తింటే ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?
అరటిపండు బొప్పాయి కలిపి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ వీటిని తినే ముందు కొన్ని రకాల విషయాలు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 04:32 PM, Sun - 5 January 25

అరటిపండు బొప్పాయి ఈ రెండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అరటి పండులో శరీరానికి అవసరమైన పొటాషియం క్యాల్షియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. బొప్పాయిపల్లిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. బొప్పాయి ని రెగ్యులర్ గా తినడం వల్ల కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుతుంది. అరటి, బొప్పాయి రెండు విభిన్న స్వభావం కలిగిన పండ్లు. అందుకే వీటిని కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్యులు.
వాంతులు, అలర్జీ, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. శ్వాస సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినకపోవడం మంచిది. అరటిపండు, బొప్పాయి కలిపి తింటే ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అందుకే ఈ పండ్ల కాంబినేషన్ తినడం వల్ల సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. కామెర్ల సమస్యతో బాధపడుతున్నవారు బొప్పాయి తినవచ్చా అంటే అస్సలు తినకూడదంటున్నారు వైద్యులు. ఇందులోని పపైన్, బీటా కెరోటిన్ కామెర్లు సమస్యను పెంచుతుందని చెబుతున్నారు.
ఇక శరీరంలో పొటాషియం అధిక స్థాయిలో ఉంటే అరటిపండ్లను తినకూడట. బొప్పాయి, అరటిపండు విడివిడిగా తినడం మంచిదని చెబుతున్నారు. అరటిపండు శరీరాన్ని చల్లబరుస్తుంది. బొప్పాయి శరీరాన్ని వేడి చేస్తుంది. ఈ రెండు పదార్థాలను కలిపి తింటే జీర్ణశక్తి క్షీణించి తలనొప్పి, వాంతులు, తల తిరగడం, అలర్జీ, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి అరటికాయ బొప్పాయి తినే వారు ఇకమీదట కలిపి అసలు తినకండి. ప్రతిరోజు ఒక అరటి పండు తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే తరచుగా బొప్పాయి తీసుకోవడం వల్ల ఇది ఎన్నో రకాల సమస్యలకు చక్కగా పనిచేస్తుంది.