Green Chilies: ప్రతీ రోజూ ఎన్ని పచ్చిమిర్చి తింటే బరువు తగ్గుతారో మీకు తెలుసా?
మన వంటింట్లో దొరికే పచ్చిమిర్చిని ఉపయోగించి అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చని,అందుకోసం వీటిని తరచుగా తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
- By Anshu Published Date - 12:00 PM, Sun - 18 May 25

పచ్చిమిర్చి.. ఇవి ఒక్కరి వంట గదిలో తప్పనిసరిగా ఉంటాయి. దాదాపుగా చాలా రకాల కూరల్లో పచ్చిమిర్చిని ఉపయోగిస్తూనే ఉంటారు. పచ్చిమిర్చి లేకుండా కూరలు చేయడం అసాధ్యం. ఒకవేళ లేకుండా చేసినా కూడా అది అంత రుచిగా ఉండవు అని చెప్పాలి. పచ్చిమిర్చి అంటేనే కారం బాబోయ్ అని అనేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఆహారం తింటున్నప్పుడు అలఓకగా తినేస్తూ ఉంటారు. అయితే గ్రీన్ చిల్లీస్ వల్ల అనేక లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ తో పాటు ఐరన్, పొటాషియం లాంటి మినరల్స్ కూడా ఇందులో ఉంటాయి. విటమిన్ సి ఎక్కువగా ఉందంటే అది బాడీ ఇమ్యూనిటీని పెంచుతుందట. ఆ రకంగా చూస్తే పచ్చిమిర్చి మన శరీరానికి చాలా అవసరం అని చెబుతున్నారు.
కాగా చాలా మంది ఉదయమే సద్దన్నంలో పెరుగు కలుపుకుని ఉల్లిగడ్డ, పచ్చి మిర్చి నంచుకుని తింటూ ఆస్వాదిస్తూ ఉంటారు. చప్పగా ఉండే పెరుగు రుచిని కారంగా ఉండే పచ్చిమిర్చి అలా బ్యాలెన్స్ చేసేది. ఇప్పటికీ కొంత మంది పప్పు అన్నం తినేటప్పుడు పక్కన పచ్చిమిర్చి పెట్టుకుంటారు. ముద్ద ముద్దకీ పచ్చిమిర్చి కొరుక్కుని తింటూ ఉంటారు. అయితే పచ్చిమిర్చి నేరుగా తినడం వల్ల కూడా అనేక రకాల లాభాలు కలుగుతాయట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా పచ్చిమిర్చిలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే ఇందులో ఉండే క్యాప్సిన్ తోనూ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. ఇది మెటబాలిజాన్ని మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గాలని చూసే వారికి మందులా పని చేస్తుందని చెబుతున్నారు. కాగా ఇందులో ఉండే క్యాప్సిన్ జీర్ణ వ్యవస్థను సరైన విధంగా ఉంచుతుందట.
అలాగే ఆహారం సులువుగా జీర్ణమయ్యేలా చేస్తుందని, దీంతో పాటు అనారోగ్యకరమైన ఆకలిని పోగొడుతుందని, తద్వారా అతిగా తినడం తగ్గుతుందని చెబుతున్నారు. మితిమీరి తినడం తగ్గితే క్రమంగా బరువు తగ్గుతారట. ఇలా వెయిట్ లాస్ కి మెడిసిన్ లా పని చేస్తుందట. తరచుగా పచ్చిమిర్చి తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. పచ్చిమిర్చిలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుందట. దీంతో పాటు చర్మ ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందట. అందుకు పచ్చిమిర్చిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడతాయట. త్వరగా ముసలితనం రాకుండా చూస్తాయట. చర్మంపై ముడతలు, యాక్నీ లాంటి సమస్యలు కూడా తొలిగిపోతాయని,అయితే పచ్చిమిర్చితో లాభాలు ఉన్నప్పటికీ వాటిని మరీ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిది కాదట. దాంతో పాటు బ్యాలెన్స్ డ్ డైట్ తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెబుతున్నారు. వీటితో పాటుగా గుండె ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుందని చెబుతున్నారు.