Fruits: ఈ పండ్లు తొక్కలతో పాటు తింటే ఎన్నో ప్రయోజనాలు.. అవేంటంటే?
ఆరోగ్యం బాగా ఉండాలి పండ్లు ఆకుకూరలు సరైన పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అయితే మనం సాధారణంగా
- By Nakshatra Published Date - 06:30 AM, Sat - 17 December 22
ఆరోగ్యం బాగా ఉండాలి పండ్లు ఆకుకూరలు సరైన పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అయితే మనం సాధారణంగా ఎన్నో రకాల పండ్లను తింటూ ఉంటాం. వీటిలో కొన్నింటిని తొక్క తీసేసి తింటే మరి కొన్ని తొక్కతో పాటు తింటాం. అయితే తొక్కతో తినాల్సినవి కూడా కొంతమంది వాటిని తినకుండా తొక్క తీసేసి తింటూ ఉంటారు. కానీ పండ్లలో కొన్ని రకాల పండ్లను తొక్కతో పాటు అలాగే తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు నిపుణులు. మరి ఎటువంటి పండ్లను తొక్కతో పాటు తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇందులో విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఏ,జింక్ వంటివి అధిక మొత్తంలో ఉంటాయి. అయితే ఈ పండుని సాధారణంగానే తొక్క తీసేసి తింటారు. కానీ తొక్కతో పాటు తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు అధిక బరువు హైబీపీ వంటి సమస్యలు తగ్గుతాయి.
మామిడి పండులో కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే మనలో కొంతమంది మామిడిపండును తొక్కతో పాటు తింటే మరీ మంది తొక్క లేకుండా తింటూ ఉంటరు. కానీ మామిడి పండు తో పాటు దాని తొక్క కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మామిడి తొక్కలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తాయి. అలాగే అందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ తొక్కలో ఉండే విటమిన్ సి గాయాలను తొందరగా మాన్పడానికి తొందరగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ తొక్కలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. చిలకడ దుంపతో పాటు దాని తొక్క కూడా ఎంతో మేలు చేస్తుంది. అందులో విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు రోగ నిరోధక శక్తి పెరిగి కంటి చూపు కూడా మెరుగు పడుతుంది.
చాలామంది ఎక్కువగా దోసకాయను తొక్కతో పాటు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అది చాలా మంచి అలవాటు. ఎందుకంటే దోసకాయ తొక్కలో ఫైబర్, పొటాషియం విటమిన్ కే లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే అధిక బరువును కూడా తగ్గిస్తుంది. ఆరంజ్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఆరెంజ్ తక్కువలో విటమిన్ ఏ,విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. బంగాళాదుప తొక్కలో నియాసిన్, పొటాషియం, ఐరన్ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా ఎర్రరక్తకణాల సంఖ్యను పెంచడానికి కూడా ఉపయోగపడతాయి.
Related News
Fruit: బ్రెయిన్ షార్ప్ అవ్వాలంటే ఈ ఒక్క పండు తినాల్సిందే?
మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాలు పండ్లు కాయగూరలు తీసుకోవాలి. పండ్లలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా ప్రతిరోజు పండ్లను తీసుకోవాల్సిందే. అటువంటి వాటిలో బెర్రీస్ పండు కూడా ఒకటి. వీటినే రాస్ బెర్రీస్ అని కూడా అంటారు. ఇవి చూడడానికి డార్క్ రెడ్ కలర్ లో ఉండి చూపులను ఆకర్షిస్తూ ఉంటాయి. రాస్ బెర్రీస్ లో పోషకాలు