Dates: నీటిలో నానబెట్టిన 3 ఖర్జూరాలు తింటే చాలు.. శరీరంలో ఊహించని మార్పులు!
నీటిలో నానబెట్టిన మూడు ఖర్జూరాలను తినడం వల్ల శరీరంలో అద్భుతమైన మార్పులు గమనించవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 05:00 PM, Sun - 23 February 25

ఖర్జూరాల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటూ ఉంటారు. ఎండు ఖర్జూరాల్లో విటమిన్స్, నిమిరల్స్ ఎక్కువగా ఉన్నాయి. డేట్స్ ను రెగ్యులర్ గా తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గిస్తుందట. ఖర్జూరం పచ్చిగా ఉన్నా, ఎండిపోయిన ఎలా ఉన్నా కూడా అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. వేసవిలో ఎండు ఖర్జూర నీళ్లు తాగని పసి పిల్లలు అరుదే. ముఖ్యంగా వేసవికాలంలో ఎండు ఖర్జూరాలను నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తిని ఆ నీరు తాగడం వల్ల ఎన్నో రకాల పోషకాలు శరీరానికి అందుతాయట.
ఎండు ఖర్జూరాలను నేరుగా తినడం కంటే నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం పరగడుపు తిని, ఆ నీరు తాగితే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయట. ఎండు ఖర్జూరాల్లో కొలెస్ట్రాల్ ఉండదు. చాలా తక్కువ కంటెంట్ ఉంటుంది. డేట్స్ లో విటమిన్స్, మినిరల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడంలో బాగా సహాయ పడుతాయట. ఎండు ద్రాక్షలో ప్రోటీన్స్, డైటరీ ఫైబర్, విటమిన్ బి1, బి2 , బి3, బి5 అధికంగా ఉన్నాయి. అలాగే వీటిలో విటమిన్ ఎ1, సి లు కూడా అధికంగా ఉన్నాయట. వీటి వల్ల శరీరం ఫిట్ గా, మజిల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయని చెబుతున్నారు. అందుకు జిమ్ చేసే వారిని కొన్ని రోజుల పాటు రెగ్యులర్ గా ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఖర్జూరాలను తినమని చెబుతున్నారు.
ఎండు ఖర్జూరాలల్లో విటమిన్ బి1, బి2, బి3, బి5 లు ఉన్నాయి. అదే విధంగా విటమిన్ ఎ1, సిలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రోజూ నాన బెట్టిని డేట్స్ ను ఒకటి రెండు తినడం వల్ల ఇన్ స్టాంట్ ఎనర్జీ వస్తుందట. విటమిన్ సప్లిమెంట్ తీసుకునే అవకాశం కూడా ఉండదట. గ్లోకోజ్, ఫ్రక్టోజ్ వంటి నేచురల్ షుగర్స్ ఉండటం వల్ల ఇవి ఎనర్జీ లెవల్స్ ను మార్చుతుందట. త్వరగా మార్పు వస్తుందట. అందుకే ఆకలిగా ఉన్నప్పుడు, లేదా నీరసంగా ఉన్న ఒక్క ఎండు ఖర్జూరం తింటే చాలు మంచి ఇన్ స్టాంట్ ఎనర్జీ పొందవచ్చని చెబుతున్నారు. అలాగే డేట్స్ లో సెలీనియం, మెగ్నీషియం, కాపర్, మెగ్నీషియంలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ బోన్స్ హెల్తీగా ఉండటానికి, ఓస్టిరియో ఫోసిస్ కండీషన్ ను నివారించడానికి ఇవి బాగా గా సహాయపడుతాయట. దంతాలను ఆరోగ్యంగా ఉంచే ఫోరిన్ మాత్రమే కాకుండా, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుందట.