Kidney Stones: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే కిడ్నీలో రాళ్ల సమస్య మొదలైనట్టే!
ఇప్పుడు చెప్పబోయే కొన్ని రకాల లక్షణాలు శరీరంలో కనిపిస్తున్నట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయకూడదని ఎందుకంటే అవి కిడ్నీలో రాళ్ల సమస్యకు లక్షణాలు చెప్పవచ్చు అని చెబుతున్నారు. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 11:00 AM, Sun - 18 May 25

ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. అయితే ఈ కిడ్నీలో రాళ్లు పడడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. తగినంత నీరు తాగకపోవడం, ఉప్పు, ప్రోటీన్, ఆక్సలేట్ అధికంగా ఉండే పాలకూర, చాక్లెట్ వంటి ఆహారాలు తినడం కుటుంబంలో ఎవరికైనా మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉంటే అలా కూడా అవ్వచ్చు. ఇలా అనేక రకాల కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. అయితే కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలుసుకోవడం చాలా కష్టమని అనుకుంటారు. కానీ చాలా సులువు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఎలా అంటే.. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నట్లయితే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయట.
ఇంతకీ ఆ లక్షణాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీకు తరచుగా వికారంగా అనిపిస్తే అది మూత్రపిండ సంబంధిత వ్యాధికి లక్షణం కావచ్చట. కిడ్నీల్లో రాళ్లు ఉంటే ఈ సమస్య తరచుగా కనిపిస్తుందని చెబుతున్నారు. మూత్ర పిండాల్లో రాళ్లు ఉంటే రక్తంలో విష పదార్థాల స్థాయిని పెంచడానికి కారణమవుతుందట. దీని వలన ఎటువంటి కారణం లేకుండా వికారంగా అనిపిస్తుందని చెబుతున్నారు. అలాగే మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపించడం లేదా నొప్పి కూడా మూత్ర పిండాల్లో రాళ్ల లక్షణం కావచ్చని, దీనినే డైసూరియా అని అంటారట. అయితే పురుషుల కంటే మహిళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, కాబట్టి మూత్రంలో మంటతో పాటు దుర్వాసన ఉంటే అది కిడ్నీల్లో రాళ్లను సూచిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉన్నవారికి మాత్రమే మూత్రంలో రక్తస్రావం కనిపిస్తుందట. మీ మూత్రం ఎరుపు రంగు లేదంటే లైట్ పింక్ కలర్ లో కనిపిస్తున్నట్లయితే ఇది సాధారణ లక్షణం కాదని వెంటనే వైద్యులు సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఈ కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారికి కడుపు నొప్పి నడుము నొప్పి వంటివి భరించలేని విధంగా ఉంటాయి. ఈ నొప్పిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మూత్ర నాలంలో రాయి కదులుతున్నప్పుడు ఈ నొప్పి మొదలవుతుంది. ఈ రాయి మూత్ర నాలంలో అడ్డుపడి కిడ్నీపై ఒత్తిడి పెంచుతుందట. కిడ్నీ నొప్పి వచ్చినప్పుడు అది తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందని, ఉన్నట్టుండి ఒక్కసారిగా నొప్పి మొదలవుతుందని చెబుతున్నారు. కాబట్టి పైన చెప్పిన లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులు సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.