Health Tips: ఏంటి.. రాత్రిపూట తొందరగా తినడం వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా?
రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 01:05 PM, Sat - 1 March 25

సమయానికి భోజనం చేయాలి అని పెద్దలు వైద్యులు చెబుతూనే ఉంటారు. కానీ చాలామంది మాత్రం ఆ మాటలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఫలితంగా లేనిపోని అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటూ ఉంటారు. అయితే సమయానికి భోజనం చేస్తే ఎలాంటి సమస్యలు రావు అని చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో సమయానికి భోజనం చేయడం చాలా అవసరం అని చెబుతున్నారు. మరి రాత్రిళ్ళు తొందరగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒక అధ్యయనం ప్రకారం రాత్రిళ్ళు త్వరగా తినడం వల్ల జీవితకాలం పెరుగుతుందట.
రాత్రిపూట తొందరగా తినడం వల్ల అజీర్ణ క్రియకు మేలు జరుగుతుందట. ఏడు గంటలకు తినడం వల్ల నిద్ర పోవడానికి సమయం ఉంటుందని దీంతో తిన్నది బాగా జీర్ణం అవుతుందని చెబుతున్నారు. రాత్రిపూట భోజనం ఆలస్యంగా చేయడం వల్ల ఎసిడిటీ గ్యాస్ కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయట. ఎందుకంటే మన శరీర పనితీరు మందగిస్తుంది. అందుకే రాత్రిపూట త్వరగా తినాలని చెబుతున్నారు. ఇది మీ జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుందట. అలాగే తొందరగా తినడం వల్ల నిద్ర పోవడానికి తినడానికి మధ్య ఎక్కువ సమయం ఉంటుంది. దాంతో త్వరగా నిద్ర పడుతుందట.. తిన్నది సులభంగా జీర్ణం కావడం వల్ల ఇలా జరుగుతుందని చెబుతున్నారు. రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల బరువు పెరిగే అవకాశం చాలా వరకు తగ్గుతుందట.
మెటబాలిజం పెరుగుతుందని చెబుతున్నారు. నిద్రపోయే ముందు మీరు తిన్న ఆహారం చాలా వరకు జీర్ణం అవుతుంది. రాత్రిపూట త్వరగా తినడం వల్ల మీ శరీరానికి ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి తగినంత సమయం లభిస్తుందట. అలాగే మీ శరీరం అన్ని పోషకాలను బాగా గ్రహిస్తుందట. త్వరగా తినడం వల్ల మీ శరీరం ఇన్సులిన్ ను బాగా ఉపయోగించగలుగుతుందని, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరగవని, ఈ అలవాటు గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు.