Health Tips: ఒకేసారి చపాతీ రైస్ కలిపి తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
చపాతి రైస్ కలిపి ఒకేసారి తినేవారు కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:30 PM, Fri - 16 August 24

మాములుగా మనలో చాలామందికీ రైస్, చపాతీ కలిపి తినే అలవాటు ఉంటుంది. కొందరు రైస్ తో పాటు కలిపి చపాతీ తింటూ ఉంటారు. మొదట రెండు చపాతీలు తిని ఆ తర్వాత కొంచెం రైస్ తింటూ ఉంటారు. అయితే ఈ రెండు కాంబినేషన్ లో ఆరోగ్యానికి అసలు మంచిది కాదు అంటున్నారు వైద్యులు తినేటప్పుడు ముందుగా చపాతీ , తర్వాత అన్నం సాంబారు మజ్జిగ తింటాము. అయితే ఇది మంచి ఆహారం కాదట. దీని వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
రాత్రిపూట చపాతీ తిని తర్వాత అన్నం తింటే బరువు పెరుగుతారట. ఈ రెండింటినీ కలిపి తినడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఈ రెండింటినీ కలిపి తింటే తగినంత పోషకాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. కానీ, ఇలా అన్నం చపాతీ కలిపి తినడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్ వేగంగా పెరుగుతాయట. అందుకే ఈ రెండింటినీ కలిపి తినడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
అన్నం, చపాతీ కలిపి తింటే అజీర్ణం సమస్య వస్తుంది. కార్బోహైడ్రేట్లు పీల్చుకోవడం వల్ల మంటతో పాటు జీర్ణక్రియ సమస్య వచ్చే అవకాశం ఉంది. అన్నం, చపాతీని కలిపి తింటే మీ శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణ మరింత పెరుగుతుంది. ఇది మీకు జీర్ణ సమస్యలు వచ్చేలా చేయడమే కాకుండా శరీరంలో మంటను కలిగిస్తుంది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. అన్నం, చపాతీ కలిపి తినడం కంటే కనీసం 2 గంటల గ్యాప్ తో తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే మీరు అన్నం తిన్న తర్వాత చపాతీ తినాలకుంటే అన్నం తిన్న రెండు గంటల తర్వాత తినాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరానికి రెండు ధాన్యాల నుంచి అన్ని పోషకాలు లభిస్తాయి. దీనివల్ల అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు కూడా రావట.
note : ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.