Heart attack: చలికాలంలో గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
చలికాలం వచ్చింది అంతే చాలు విపరీతమైన చలితో పాటు ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు అనారోగ్య సమస్యలను
- By Anshu Published Date - 06:30 AM, Tue - 27 December 22

చలికాలం వచ్చింది అంతే చాలు విపరీతమైన చలితో పాటు ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు అనారోగ్య సమస్యలను తీసుకువస్తుంది. చలికాలంలో శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. చలికాలంలో ఎక్కువగా క్లైమేట్ కూల్ గా ఉంటుంది కాబట్టి మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. చలికాలంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో పాటు గుండె సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి గుండె జబ్బులు సమస్యలు రాకుండా ఉండాలి అంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మరి చలికాలంలో గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చలికాలంలో గుండె నిజంగా ప్రమాదంలో ఉన్నప్పటికీ, శీతాకాలంలో వారి గుండె ఆరోగ్యాన్ని గురించి జాగ్రత్త వహించాల్సిందే. ఎందుకంటె ప్రస్తుత రోజుల్లో గుండెపోటు, మధుమేహం, రక్తపోటు, హై కొలెస్ట్రాల్ వంటి సమస్య కలిగిన వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. కుటుంబంలో గుండె జబ్బులు ఉన్నవారు ఎక్కువ ఆల్కహాల్, పొగాకు వినియోగం ఉన్నవారు కూడా ఎక్కువ ప్రమాదం. గుండె సంబంధిత సమస్యతో బాధపడేవారు ఎప్పటికప్పుడు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. చలికాలంలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు మరింత జాగ్రత్త వహించాలి. తరచూ ఎప్పటికప్పుడు మెడికల్ చెక్ అప్ చేయించుకోవడం అవసర. చలికాలం దాని సొంత డైట్స్ ని ఫాలో అవుతూ ఉంటారు.
మనలో చాలా మంది సీజనల్ డైట్స్ ఆరోగ్యానికి మంచివని చెబుతారు. చలికాలంలో దొరికే ఫుడ్స్ తింటారు కానీ వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాత్రం ఆలోచించరు. చలికాలంలో మనం తీసుకునే ఫుడ్ గుండె పై ప్రభావం చూపిస్తున్నా అంటే అవును అని చెప్పవచ్చు. చలికాలంలో ప్రజలు ఎక్కువ కేలరీల ఫుడ్‌ని తీసుకుంటారు. ముఖ్యంగా నెయ్యితో కూడిన స్వీట్స్‌ని తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అలాగే చలికాలంలో మందు బాబులు గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఆల్కహాల్‌ని తగ్గించాలి. ఎందుకంటే, ఇది వాసోడైలేషన్‌కు కారణమవుతుంది. అలాగే పిజ్జాలు బర్గర్లు వంటి ఆహార పదార్థాలు తీసుకునే బదులు తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలని ఆయన చెబుతున్నారు. వారు తమ ఆహారంలో బాదం, డ్రైఫ్రూట్స్ వంటి నట్స్‌ని చేర్చుకోవడం ఎంతో మంచిది.