Chest Pain: ఛాతిలో పదేపదే మంటగా అనిపిస్తోందా.. అయితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
గుండెల్లో లేదా ఛాతిలో మంటగా అనిపించినప్పుడు అసలు నిర్లక్ష్యం చేయకూడదని ఇది అనేక రకాల సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అనిపించినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 03:00 PM, Mon - 14 April 25

అప్పుడప్పుడు గుండెల్లో లేదా ఛాతిలో మంటగా అనిపించడం అన్నది సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఛాతీలో మంట అనేది ఎక్కువ మసాలా ఫుడ్ తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఇలాంటి సమస్య కలుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు చాలామంది మెడిసిన్స్ ఉపయోగించడం లేదంటే ఈనో వంటివి తాగడం చేస్తూ ఉంటారు. ఇది సాధారణంగా కడుపులో అన్నవాహిక లోకి తిరిగి వచ్చినప్పుడు వస్తూ ఉంటుంది. ఛాతీలో మంట అనేది ఛాతీ భాగంలో, ముఖ్యంగా గుండె వెనుక భాగంలో మంటగా అనిపించే ఒక అనుభూతి. కాగా ఛాతీలో మంటకు అనేక కారణాలు ఉన్నాయి.
వాటిలో యాసిడ్ రిఫ్లక్స్ కూడా ఒకటి. కడుపులోని యాసిడ్ అన్నవాహికలోకి తిరిగి వచ్చినప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ సంభవిస్తుందట. ఇది కడుపు అన్నవాహిక మధ్య ఉండే కండరం సరిగా మూసుకోవడంలో విఫలమైనప్పుడు జరుగుతుందట. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి ఇది దీర్ఘకాలిక యాసిడ్ రిఫ్లక్స్. హైటల్ హెర్నియా అనేది ఇది యాసిడ్ రిఫ్లక్స్ కు కారణమవుతుందట. అంతే కాకుండా అధిక బరువు ఉండటం కడుపుపై ఒత్తిడిని పెంచుతుందట. ఇది యాసిడ్ రిఫ్లక్స్ కు దారితీస్తుందటీ. మహిళలకు గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పులు, కడుపుపై పెరిగిన ఒత్తిడి యాసిడ్ రిఫ్లక్స్ కు కారణమవుతాయట. కాగా ధూమపానం అన్నవాహిక కండరాన్ని బలహీనపరుస్తుందట. యాసిడ్ రిఫ్లక్స్ కు దోహదం చేస్తుందట.
కొన్ని ఆహారాలు, పానీయాలు, ముఖ్యంగా కొవ్వు పదార్ధాలు, కారంగా ఉండేవి, చాక్లెట్, కెఫిన్, ఆల్కహాల్ యాసిడ్ రిఫ్లక్స్‌ను ప్రేరేపిస్తాయట. అంతే కాకుండా కొన్ని మందులు, నొప్పి నివారణలు, కొన్ని యాంటీ బయాటిక్స్, రక్తపోటు మందులు వంటివి ఛాతీలో మంటను కలిగిస్తాయట. మానసిక ఒత్తిడి,ఆందోళన కూడా ఛాతీలో మంటను పెంచుతాయని చెబుతున్నారు. కాగా ఛాతీలో మంటను తగ్గించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కొన్ని జీవనశైలి మార్పులు, కొన్ని వైద్య చికిత్సలు సహాయపడతాయి. చిన్న మొత్తాలలో, తరచుగా తినండి. ఒకేసారి ఎక్కువ తినడం మానుకోవాలి. కొవ్వు పదార్ధాలు, కారంగా ఉండేవి, చాక్లెట్, కెఫిన్, ఆల్కహాల్, పుల్లని పండ్లను తగ్గించాలట. భోజనం చేసిన వెంటనే పడుకోవడం మానుకోవాలి.
భోజనం చేసిన కనీసం 2 నుంచి 3 గంటల తర్వాత పడుకోవాలి. నిద్రించేటప్పుడు తల భాగం కొంచెం ఎత్తులో ఉండేలా దిండు పెట్టుకోవాలి. అంతే కాకుండా అధిక బరువు లేదా ఊబకాయం ఉంటే, బరువు తగ్గడం ఛాతీలో మంటను తగ్గించడంలో సహాయపడుతుందట. ధూమపానం ఛాతీలో మంటను తీవ్రతరం చేస్తుందట. కాబట్టి ధూమపానం మానుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదట. ఆల్కహాల్ కూడా ఛాతీలో మంటను పెంచుతుందట. ఆల్కహాల్ సేవనాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం మంచిదట. యోగా, ధ్యానం, వ్యాయామం లేదా మీకు నచ్చిన ఇతర పద్ధతుల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలట. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఛాతిలో నొప్పి మంట తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని చెబుతున్నారు..