Onions: తెల్ల ఉల్లిగడ్డ, ఎర్ర ఉల్లిగడ్డ.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో మీకు తెలుసా?
- By Sailaja Reddy Published Date - 09:00 AM, Mon - 4 March 24
మామూలుగా మనకు మార్కెట్లో రెండు రకాల ఉల్లిపాయలు కనిపిస్తూ ఉంటాయి. అందులో తెల్ల ఉల్లిపాయలు ఒకటి, రెండవది ఎర్ర ఉల్లిపాయలు. అయితే ఎక్కువ శాతం మనకు ఎర్ర ఉల్లిపాయలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది అన్న విషయంపై చాలామందికి అనేక రకాల సందేహాలు నెలకొంటూ ఉంటాయి. మరి ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా ఎర్ర ఉల్లిగడ్డతో పోల్చితే తెల్ల ఉల్లిగడ్డ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం తెల్ల ఉల్లిగడ్డ వల్ల ప్రయోజనాలే. తెల్లి ఉల్లిపాయలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి.
వీటిలో ఎక్కువగా విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, ఫైటోన్యూట్రియెంట్ ఆరోగ్యాన్ని కాపాడడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో తెల్ల ఉల్లిగడ్డ కీలక పాత్ర పోషిస్తుంది. తెల్ల ఉల్లిలోని క్రోమియమం, సల్ఫర్లు రక్తంలోని షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో ఈ ఉల్లిగడ్డను క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా తెల్ల ఉల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కారకాలతో పోరాడుతుంది. ముఖ్యంగా శరీరంలో ఏర్పడే కణితిల పెరుగుదులను నిరోధించడంలో ఉల్లి కీలక పాత్ర పోషిస్తుంది.
తెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇంకా అధిక రక్తపోటును తగ్గించడానికి, రక్తం గడ్డ కట్టకుండా నిరోధించడానికి కూడా తెల్ల ఉల్లి సహాయ పడుతుంది. అయితే ఎర్ర ఉల్లి గడ్డలోనూ ఇలాంటి లాభాలే ఉన్నా ఎక్కువగా మాత్రం తెల్ల ఉల్లిగడ్డలోనే ఎక్కువగా లాభాలు ఉన్నాయి.
Related News
Ayushman Bharat Card: మీకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉందా..? లేకుంటే దరఖాస్తు చేసుకోండిలా..!
ఈ పథకం కింద ప్రజలు క్యాన్సర్, కిడ్నీ, గుండె, డెంగ్యూ, మలేరియా డయాలసిస్, మోకాలు, తుంటి మార్పిడి వంటి అనేక వ్యాధులకు ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆసుపత్రులలో ఉచితంగా చికిత్స పొందవచ్చు.