HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Health
  • ⁄Do You Know What Happens If You Eat Rabdi And Jalebi Together

Rabdi, Jalebi: రబ్ది, జిలేబి కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

నోరూరించే వేడి వేడి జిలేబి తింటుంటే ఎంతైనా తినాలని అనిపిస్తుంది. మరి దానికి తోడు రబ్ది చేరిస్తే ఆ రుచి చెప్పడం కాదు తింటేనే తెలుస్తుంది.

  • By Maheswara Rao Nadella Published Date - 04:00 PM, Sun - 19 March 23
Rabdi, Jalebi: రబ్ది, జిలేబి కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

నోరూరించే వేడి వేడి జిలేబి (Jalebi) తింటుంటే ఎంతైనా తినాలని అనిపిస్తుంది. మరి దానికి తోడు రబ్ది (Rabdi) చేరిస్తే ఆ రుచి చెప్పడం కాదు తింటేనే తెలుస్తుంది. ఈ రెండు కలిపి మనసుకి చాలా సంతృప్తిగా ఉంటుంది. రబ్దిని రబ్రీ అని కూడ పిలుస్తారు. పాలతో చేసే ఒకరకమైన స్వీట్ ఇది. తెల్లటి క్రీములాగా రుచిగా ఉంటుంది. అయితే జిలేబి, రబ్ది (Rabdi) కలిపి తీసుకుంటే దీర్ఘకాలికంగా వేధించే మైగ్రేన్ సమస్యను తగ్గించుకోవచ్చట. వినేందుకు వింతగా ఉన్న ఇది నిజమేనట. ఆయుర్వేద నిపుణులు ఈ విషయాన్ని సమర్థిస్తున్నారు. మైగ్రేన్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉదయాన్నే ఖాళీ కడుపుతో రబ్ది, జిలేబి కలిపి తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. దీనికి సంబంధించి ఆయుర్వేద కన్సల్టెంట్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

సూర్యోదయానికి ముందు ఉన్న కాలాన్ని వాత సమయం అంటారు. నొప్పి వాత దోషంతో ముడిపడి ఉంటుంది. రబ్దితో కూడిన జిలేబి కఫవర్ధక ఆహారం అందుకే వాత సమయంలో దీన్ని తినాలని చెబుతున్నారు. ఈ ఆహారం వ్యక్తి నరాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

రబ్ది జిలేబిలు (Rabdi Jalebi) ఎన్ని తినాలి?

జిలేబి, రబ్ది రెండూ తియ్యని పదార్థాలు. చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు కాబట్టి కేలరీలు అధికంగా ఉంటాయి. అందుకే మైగ్రేన్ నొప్పిని తగ్గించుకోవడానికి వీటిని తినాలంటే కాస్త సంకోచిస్తారు. అయితే ఈ సూచన అందరికీ సరిపోదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చక్కెర తినడం వల్ల ఎటువంటి సమస్యలు లేని వాళ్ళు వారం నుంచి గరిష్టంగా మూడు వారాల వరకు దీన్ని తీసుకోవచ్చు. అయితే డయాబెటిస్, లాక్టోస్ అసమతుల్యతో ఉన్న వాళ్ళు దీన్ని నివారించడమే ఉత్తమం. ఎందుకంటే ఇది తీపి పదార్థం.

జిలేబిని ఫ్రిజ్ లో రాత్రంతా పాలలో నానబెట్టాలి. ఉదయం 5.30/6.00 గంటల్లోపు తినాలి. ఇది మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం కలిగించేందుకు పని చేస్తుందని ఈ పోస్ట్ కి ఒక నెటిజన్ స్పందించారు. ఇది చేయడం వల్ల నొప్పి తగ్గిందని మరొకరు చెప్పుకొచ్చారు.

మరి దగ్గు మాటేమిటి?

రబ్ది, జిలేబి రెండూ తియ్యగా ఉంటాయి. దాని వల్ల బరువు పెరగడం, మధుమేహం, దగ్గు వంటి సమస్యలు మాటేమిటని మరికొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అధికంగా చక్కెర తీసుకుంటే బరువు పెరుగుతారు. దగ్గు, జలుబు వంటి సమస్యలు ఎదురవుతాయి. కఫవర్ధక ఆహారాన్ని తినాలనే సిద్ధాంతం సరైనదే. అయితే 400 కేలరీలు అధికంగా ఉండే కొవ్వు, చక్కెర ఉన్న రబ్ది జిలేబికి బదులుగా నానబెట్టిన ఖర్జూరం, పుచ్చకాయ, పండిన తీపి మామిడి పండ్లు, పెరుగు తీసుకోవచ్చని మరికొందరు చెబుతున్నారు. ఇవి కూడా మైగ్రేన్ నొప్పిని అదుపులో ఉంచుతాయి. రబ్ది, జిలేబి కలిపి తీసుకుంటే బరువు పెరగడానికి దారి తీస్తుంది. ఇవే కాదు మధుమేహం, పీసీఓస్, హైపోథైరాయిడిజం వంటివి కూడా తీవ్రమవుతాయని మరొక నెటిజన్ రాసుకొచ్చారు. స్వీట్ తీసుకోవడం వల్ల తలనొప్పి మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read:  Hardik Pandya: హార్థిక్ అప్పుడే అంత తలకెక్కిందా?

Telegram Channel

Tags  

  • benefits
  • Eat
  • Happens
  • health
  • Jalebi
  • Life Style
  • Rabdi
  • tips
  • together
  • Tricks
  • What
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Copper: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?

Copper: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?

సాధారణంగా వెండి,బంగారం,వజ్రాలతో తయారుచేసిన ఆభరణాలను ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. వజ్రాల కంటే వెండి

  • Ugadi Day: ఉగాది రోజున ఏమి చేయాలి..?

    Ugadi Day: ఉగాది రోజున ఏమి చేయాలి..?

  • April 1 Coming: ఆ లోపు పూర్తి చేయాల్సిన ముఖ్యమైన ఆర్థిక పనులివే

    April 1 Coming: ఆ లోపు పూర్తి చేయాల్సిన ముఖ్యమైన ఆర్థిక పనులివే

  • Chaitra Navratri Special: సాత్విక, రాజస, తామస ఆహారం మధ్య తేడా? ప్రయోజనాలు?

    Chaitra Navratri Special: సాత్విక, రాజస, తామస ఆహారం మధ్య తేడా? ప్రయోజనాలు?

  • Dreams: కలలో ఈ 5 విషయాలను చూస్తే.. ఇక మీకు మంచిరోజుల క్యూ

    Dreams: కలలో ఈ 5 విషయాలను చూస్తే.. ఇక మీకు మంచిరోజుల క్యూ

Latest News

  • Libra: శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 తుల రాశి ఫలితాలు

  • Virgo: శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 కన్యా రాశి ఫలితాలు

  • Leo: శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 సింహ రాశి ఫలితాలు

  • Cancer: శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 కర్కాటక రాశి ఫలితాలు

  • IND Vs AUS: నేడు భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే.. టీమిండియా సిరీస్ గెలుస్తుందా.. చతికిలపడుతుందా..?

Trending

    • Odisha Temple: ఎలుకలతో దేవతమూర్తులకు నిద్రాభంగం.. అలర్ట్ అయిన పూజారులు!

    • Unfit Cops: పంజాబ్ పోలీసులపై హైకోర్టు సీరియస్… 80 వేల మంది ఏం చేస్తున్నారంటూ !

    • Umesh Chandra:వైఎస్ రాజారెడ్డికి సంకెళ్లు వేసిన గ్రేట్ ఐపీఎస్

    • MS Dhoni: ధోని గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప..!

    • Rohit Sharma: రోహిత్ శర్మ బ్యాటింగ్ లోనే కాదు.. డ్యాన్స్ లో కూడా ఆదరగొట్టాడు.. వీడియో వైరల్..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: