Calcium Deficiency: కాల్షియం లోపిస్తే…ఏమౌతుందో తెలుసా?
కాల్షియం...మన శరీరంలో ఓ కీలకమైన పోషక పదార్థం. నరాల ద్వారా మెదడుకు సందేశాలు పంపేటువంటి శరీర విధులకు కాల్షియం ముఖ్యం.
- By hashtagu Published Date - 06:30 AM, Mon - 6 June 22

కాల్షియం…మన శరీరంలో ఓ కీలకమైన పోషక పదార్థం. నరాల ద్వారా మెదడుకు సందేశాలు పంపేటువంటి శరీర విధులకు కాల్షియం ముఖ్యం. ఇంకా హార్మోన్లు స్రావం, కండరాలు, నరాల సంకోచ వ్యాకోచాలకు కాల్షియం ఎంతగానో అవసరం. ముఖ్యంగా అస్థిపంజర పనితీరుకు కాల్షియమే నిదర్శనం. అయితే కొందరిలో పలు కారణాల వల్ల కాల్షియం లోపిస్తుంటుంది.
దీన్ని వైద్యపరిభాషలో హైపోకాల్సీమియా అంటారు. హైపోకాల్సీమియాకు చికిత్స తీసుకోనట్లయితే…ఆప్టియో పేనియా అనే ఎముకలు సన్నబడే వ్యాధి పిల్లల్లో బలహీనమైన ఎముకలు, ఎముక సాంద్రత కోల్పోయే వ్యాధి వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. అయితే ఆహార అలవాట్లలో మార్పులు చేసినట్లయితే…కాల్షియం లోపాన్ని నివారించవచ్చు.
కాల్షియం లోపిస్తే ఈ లక్షణాలు కనిపిస్తాయి.
1.పాదాలు, వేళ్లు, కాళ్లలో తిమ్మిర్లు వస్తుంటాయి.
2. కండరాలలో తిమ్మిర్లు లేదా కండరాలు పట్టేయడం
3. బద్దకం, అలసట
4. బలహీనంగా పెళుసుగా ఉండే గోర్లు
5. దంత సమస్యలు
6. గందరగోళంగా అనిపించడం
7. ఆకలి మందగించడం
ఇక కాల్షియం దీర్ఠకాలికంగా లోపిస్తే అనేక ఇతర శరీర భాగాలను బాధిస్తుంది. అందుకే మనకు పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినట్లయితే పరీక్ష చేయించుకుని లోపం ఉందని నిర్థారణ అయితే తగిన మందులు వాడటం మంచిది. లేదంటే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి.
నివారణకు తీసుకోవల్సిన ఆహార పదార్థాలు..!!
1.పాలు, పాల ఉత్పత్తులు, పెరుగు, పాలు, పులియబెట్టిన పెరుగు, పన్నీర్, రసమలై.
2. బచ్చలికూర, పాలకూర, బ్రోకలీ, పప్పుధాన్యాలు, బీన్స్ బఠానీలు
3. మినరల్ వాటర్
4. సీఫుడ్, కొవ్వులేని మాంసం, గుడ్లు,
5. ఖర్జూర, తీసుకోవడం మంచిది.
కాల్షియం పుష్కలంగా ఉంటే ఎముకలు బలంగాఉంటాయి. దంతాలు, గుండె కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి కాల్షియం లోపించకుండా చూసుకోవడం ముఖ్యం.