Cranberry Juice: క్రాన్బెర్రీ జ్యూస్‌లో ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసా?
- Author : Vamsi Chowdary Korata
Date : 12-05-2026 - 9:51 IST
Published By : Hashtagu Telugu Desk
క్రాన్ బెర్రీ…వీటి గురించి ఎంత మందికి తెలుసు? ఈ జ్యూస్ తాగితే కలిగే లాభాల గురించి అసలు తెలుసా? చాలా మందికి తెలియదు. సాధారణంగా ఇందులో నీరు, చక్కెర మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజూ ఈ జ్యూస్ తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే క్రాన్ బెర్రీ జ్యూస్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయట. అవేంటో తెలుసుకుందాం.
దంత సమస్యలను తగ్గిస్తుంది.
క్రాన్ బెర్రీ జ్యూస్ తాగితే దంత సమస్యలు తగ్గుతాయట. కేవిటిని నివారించడంలో క్రాన్ బెర్రీ జ్యూస్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలో గడ్డలు రాకుండా నివారిస్తుంది. క్రాన్ బెర్రీస్‌లో ఉండే పాలీఫెనోలిక్ సమ్మేళనాల కారణంగా ఊపిరితిత్తులు, రొమ్ము, పెద్దప్రేగు, ప్రోస్టేట్‍లలో శరీరంలో గడ్డలు రాకుండా చేస్తుంది. క్యాన్సర్ కణాల కణితులను ఏర్పరచకుండా నిరోధిస్తుంది. అంతేకాదు హైడ్రాక్సీ బెండాయిక్ యాసిడ్ రక్తం గడ్డకట్టడాన్ని, వాపును తగ్గిస్తుంది.
జీర్ణక్రియను పునరుద్ధరించడంలో…
క్రాన్ బెర్రీ జ్యూస్ జీర్ణక్రియను పునరుద్ధరించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది ప్రేగు వ్యవస్థను కూడా రక్షిస్తుంది. ప్రేగుల్లో ఉండే చెడు బ్యాక్టీరియాను నాశనం చేసే గుణం ఇందులో ఉంది. ఇది స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ వ్యాయామం చేయలేని వారు ఈ జ్యూస్ తాగితే శరీరంలో ఏర్పడే చెడు కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు.
పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు…
ఈ క్రాన్ బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి, ఇ, కెరోటిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే సెల్ డ్యామేజ్‌ను అరికడతాయి. క్యాన్సర్‌ను నిరోధించడంలోనూ క్రాన్ బెర్రీస్ ముందుంటాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు జీర్ణాశయాంతర రుగ్మతలు తగ్గుతాయని చెబుతున్నారు.
గ్యాస్ట్రిక్ సమస్యకు చెక్…
కడుపులో ఏర్పడే పుండ్లు, గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటుగా అల్సర్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. క్రాన్ బెర్రీస్‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. ఇది మెదడును, మెదడు కణాలను రక్షించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక వేసవిలో చల్ల చల్లని క్రాన్ బెర్రీ జ్యూస్ తాగితే ఎంతో ఉపశమనం లభిస్తుంది.