IRON : ఐరన్ లోపం వలన వచ్చే ఆరోగ్య సమస్యలు మీకు తెలుసా.. ఐరన్ కావాలంటే ఏం తినాలి?
ఐరన్ మన శరీరంలో(Body) తగినంత లేకపోతే ఎనీమియా అంటే రక్తహీనత ఏర్పడుతుంది. ఐరన్ లోపం అనేది ఏ వయసు వారైనా రావచ్చు.
- By News Desk Published Date - 10:30 PM, Tue - 9 May 23

ఐరన్(Iron) మన శరీరంలో తగినంత ఉండడం వలన మన శరీరంలో ఎర్ర రక్తకణాలు కొత్తవి ఏర్పడుతుంటాయి. ఐరన్ మనం తీసుకునే ఆహారం ద్వారానే మనం మన శరీరానికి అందించాలి. ఐరన్ మన శరీరంలో(Body) తగినంత లేకపోతే ఎనీమియా అంటే రక్తహీనత ఏర్పడుతుంది. ఐరన్ లోపం ఉన్నవారికి చిన్న పని చేయగానే అలసట రావడం, ఎక్కువగా దాహం వేయడం, గొంతులో గరగరగా ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జుట్టు ఎక్కువగా రాలడం వంటి సమస్యలు కనబడతాయి. ఐరన్ లోపం అనేది ఏ వయసు వారైనా రావచ్చు.
నాలుగు నుండి ఎనిమిది సంవత్సరాల పిల్లలకు రోజుకు పది మిల్లీ గ్రాముల ఐరన్ అవసరం అవుతుంది. తొమ్మిది నుండి పదమూడేళ్ల వయసు గల పిల్లలకు మరియు పద్నాలుగు నుండి యాభై సంవత్సరాల వయసు గల మగవారికి రోజుకు ఎనిమిది మిల్లీగ్రాముల ఐరన్ అవసరం అవుతుంది. పద్నాలుగు నుండి యాభై సంవత్సరాల వయసు గల ఆడవారికి రోజుకు పద్దెనిమిది గ్రాముల ఐరన్ అవసరం అవుతుంది. మగవారితో పోలిస్తే ఆడవారికి ఎక్కువ ఐరన్ అవసరం అవుతుంది ఎందుకంటే ఆడవారికి పీరియడ్స్ సమయంలో ఎక్కువ రక్తస్రావం జరుగుతుంది కాబట్టి.
ఈ రోజుల్లో చాలామంది జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉండడం లేదు. అందుకే చాలా మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ఐరన్ ఎక్కువగా బాదంపప్పు, జీడిపప్పు, అక్రోట్, బెల్లం, నువ్వులు, బీట్రూట్, పిస్తా, ఉసిరి, నేరేడు, నిమ్మకాయ, దానిమ్మ, పాలకూర, ఆపిల్, ఎండుద్రాక్ష, అంజీర్, జామకాయలు, అరటి, మునగకాయ, తులసి వంటి వాటిలో ఉంటుంది. వీటిని మనం రోజూ తినే ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన ఐరన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు.
Also Read : Copper Vessels : రాగి పాత్రలు ఎప్పుడూ కొత్తవాటిలా మెరవాలంటే ఏం చేయాలో తెలుసా?