Spinach : బచ్చలి కూర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
బచ్చలి కూర (Scpinach) సాగుకు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వేస్తే చాలు తీగల అల్లుకుపోతూ ఉంటుంది.
- Author : Naresh Kumar
Date : 26-01-2024 - 5:42 IST
Published By : Hashtagu Telugu Desk
ఆకుకూరలు వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే వైద్యులు తరచూ తాజా ఆకుకూరలను డైట్ లో చేర్చుకోమని చెబుతూ ఉంటారు. తరచుగా ఆకుకూరలు తింటూ ఉండటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరడంతో పాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు ముఖ్యంగా ఆకుకూరలలో బచ్చలి కూర (Spinach) ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే బచ్చల కూరను సర్వరోగ నివారిణిగా కూడా పిలుస్తారు. అయితే మనలో చాలామంది బచ్చల కూర తినడానికి అంతగా ఇష్టపడరు.
We’re now on WhatsApp. Click to Join.
కానీ ఇందులో ఉండే లాభాల గురించి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా తినకుండా అస్సలు ఉండలేరు. బచ్చల కూర ఎక్కువగా గ్రామాల్లో పట్టణాలలో ఇంటి పెరట్లో ఇంటి దగ్గర ఖాళీ ప్రదేశాలలో పండిస్తారు. బచ్చలి కూర (Scpinach) సాగుకు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వేస్తే చాలు తీగల అల్లుకుపోతూ ఉంటుంది. ముఖ్యంగా బచ్చలి కూరను (Spinach) ఔషధాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. బచ్చల కూరను పప్పులో వేసుకుని తింటే జ్వరం, జలుబు ఇట్టే తగ్గిపోతాయి. అలాగే కడుపులో మంట కూడా తగ్గుతుంది. సాధారణంగా పచ్చ కామెర్లు వచ్చినవారికి ఉపయోగించే చికిత్సలో బచ్చల కూరని ఎక్కువగా వాడుతారు. ఈ కూరను ఆహారంగా తీసుకున్నప్పుడు మనలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
ఇక కంటి చూపు తగ్గిన వారికి బచ్చలి కూర బాగా పనిచేస్తుంది. అలాగే ఉబకాయంతో బాధపడే వారికి ఈ కూర మంచి మెడిసిన్ లా పని చేస్తుంది. బాడీలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపిస్తుంది. బచ్చల ఆకులో ఉండే రసాన్ని జ్యూస్ గా చేసుకొని తాగడం వలన శరీరంలో పేరుకున్న మలినాలు బయటకు వెళ్ళిపోతాయి. దీంతో పొట్ట శుభ్రం అవుతుంది. కడుపు ఉబ్బరం తగ్గి ప్రశాంతత లభిస్తుంది. జీర్ణవ్యవస్థ పరుతీరును కూడా మెరుగుపరుస్తుంది. బచ్చల కూరను బీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. కడుపుబ్బరం కూడా నయం అవుతుంది. బచ్చల కూర తినడం వలన గ్యాస్ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.
Also Read: Pregnancy : గర్భదానం ఎందుకు జరిపిస్తారు.. మంచి ముహూర్తంలో జరగకపోతే ఏం జరుగుతుందో తెలుసా?