Summer: సమ్మర్ లో ఆ జాగ్రత్తలు మస్ట్.. అవేంటో తెలుసా
- By Balu J Published Date - 07:26 PM, Fri - 22 March 24

Summer: ఉదయం 8 గంటలు భానుడి భగభగలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. దైనందిన జీవితంలో వృత్తి ఉద్యోగాలపై బయటకు వెళ్లకుండా ఉండలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో కనీస జాగ్రత్తలే మంచిదన్నారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వేసవిని జయించవచ్చు
ఎండలో ఎక్కువగా తిరగటం వల్ల డిహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. భానుడి ప్రతాపం తీవ్రస్థాయిలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య బయటకు వెళితే డిహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంది. డిహైటేషన్కు గురైన వ్యక్తి ఒంట్లోని నీరు, లవణాలు తగ్గిపోయి నిస్సత్తువ ఆవహిస్తుంది. దీంతో ఆ వ్యక్తిలో చిరాకు, ఆందోళన ఏర్పడి ఏమీ చేయలేని పరిస్థితికి చేరుకుంటాడు. తలనొప్పి వేగంగా అలసిపోవడం లాంటి ఇబ్బందులు ఉంటాయి.
వేసవిలో నాలుక పిడచ కట్టుకుపోతుంది. ఇటువంటి సమయంలో ఏది పడితే అది వినడం, తాగటం మంచిది కాదు. కలుషిత ఆహారము నీరు వల్ల అతిసార బారిన పడే అవకాశం ఉంది. ఒంట్లో శక్తి పూర్తిగా తగ్గిపోయి నీరసం ఏర్పడుతుంది. వ్యక్తి త్వరగా కోలుకునేందుకు కాచి చల్లార్చిన మంచి నీటిని తాగించాలి. ఈ కాలంలో వచ్చిన జ్వరం శరీరంలోని ఉష్ణోగ్రతను తీవ్ర స్థాయిలో పెంచి నిశ్శత్తువ ఆవహించేలా చేస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో జ్వరాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలి.
ఎక్కడపడితే అక్కడ కూలింగ్ వాటర్, చల్లని పానీయాలు, మజ్జిగ తాగటం వల్ల జలుబు చేసే అవకాశం ఉంది. జలుబు చేసిన వ్యక్తికి ముక్కు వెంట విపరీతంగా నీరు కారణం, తలనొప్పి వస్తుంది. ప్రధానంగా ఈ కాలంలో అమ్మవార్లు, చంప గడ్డలు, దవడల సమస్య తీవ్రంగా ఉంటుంది. వీటిని గోకటం వల్ల పుండ్లు ఏర్పడి మరింత ఇబ్బంది అవుతుంది. ఈ కాలంలో రోజు రెండుసార్లు స్నానం చేయడం ద్వారా ఎప్పటికప్పుడు శుభ్రత ఏర్పడి ఇటువంటి సమస్యలను వీలైనంత వరకు దూరం చేసుకోవచ్చు.