Health Tips: ఎప్పుడైన బెల్లం, లవంగాలు కలిపి తిన్నారా.. అలా తింటే ఏం జరుగుతుందో ఎటువంటి లాభాలు కలుగుతాయో తెలుసా?
బెల్లం లవంగాలు కలిపి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని, ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:03 PM, Thu - 17 April 25

మన వంటింట్లో దొరికే వాటిల్లో బెల్లం లవంగాలు కూడా ఒకటి. ఇవి రెండింటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బెల్లంని ఎన్నో రకాల స్వీట్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. లవంగాలను కూడా మసాలా దినుసులలో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా ఈ రెండు కలిపి తిన్నారా, రెండు కలిపి తింటే ఏం జరుగుతుందో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
లవంగాలు, బెల్లాన్ని కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుందట. లవంగాలు, బెల్లాన్ని కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం ఉంటుందట. జీర్ణ సమస్యలను దూరం చేసే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వీటిలో ఉంటాయని, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయని చెబుతున్నారు. కాగా యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తాయట. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో ఈ కాంబినేషన్ నొప్పి నుంచి, క్రాంప్స్ నుంచి ఉపశమనం ఇస్తుందని చెబుతున్నారు. అయితే లవంగాలను నీళ్లలో వేసి మరిగించాలి.
దానిలో బెల్లం వేసుకుని తాగితే మంచిది. లవంగాల పొడి, బెల్లాన్ని గోరువెచ్చని నీళ్లలో వేసుకుని కలిపి తాగినా మంచి ప్రయోజనాలు అందుతాయట. కూరల్లో, సూప్స్ లో, స్వీట్స్ లో కూడా వీటి కాంబినేషన్ ట్రై చేసి తీసుకోవచ్చని చెబుతున్నారు. లవంగాలు, బెల్లాన్ని పేస్ట్ గా చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయట. ఇవి కేవలం అవగాహన కోసమే మాత్రమే ఈ విషయంలో వైద్యుల సలహా తప్పనిసరి అని చెబుతున్నారు. పీరియడ్స్ సమయంలో బెల్లం, లవంగాలు కలిపి తినటం వల్ల నొప్పి నుంచి, క్రాంప్స్నుంచి ఉపశమనం ఇస్తుందట. కాబట్టి బెల్లం లవంగాలు కలిపి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు.